Delhi Coronavirus: కరోనా కట్టడికి ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం.. మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

|

Mar 27, 2021 | 3:13 PM

Delhi Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక ఢిల్లీలో కూడా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో...

Delhi Coronavirus: కరోనా కట్టడికి ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం.. మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
Satyendar Jain
Follow us on

Delhi Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక ఢిల్లీలో కూడా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేకుండా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ శనివారం ఓ సమావేశంలో వెల్లడించారు. అయితే చాలా మందికి సాంకేతిక పరిజ్ఞానం ఉండకపోవడంతో ఇక నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేకుండానే టీకాలు వేయనున్నట్లు తెలిపారు. కాగా, కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ మాత్రమే పరిష్కారం కాదు.. ప్రస్తుతం ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి లాక్‌డౌన్‌ విధించాం. అప్పుడు వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి లాక్‌డౌన్‌ విధించడంలో అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో 14 రోజులు లేదా 21 రోజులు పెంచుతూ దేశాన్ని లాక్‌డౌన్‌లో ఉంచినప్పటికీ వైరస్‌ వ్యాప్తి ఆగలేదు. అందుకే ప్రస్తుతం కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం వల్ల పరిష్కారం కాదు అని మంత్రి అన్నారు. ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని, కేవలం 20 శాతం మాత్రమే నిండి ఉన్నాయని అన్నారు. అవసరమైతే మరిన్ని పడకలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1534 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 9 మంది మృతి చెందారు.ఇప్పటి వరకు ఢిల్లీలో 6,45,276 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 6,051 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 10,987కు చేరింది.

ఇవీ చదవండి : Breaking News: రాత్రి సమయంలో కర్ఫ్యూ.. కనిపిస్తే తాట తీస్తారు.. ఎప్పటి నుంచి అమలు అంటే..!

మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. కొత్తగా 495 మందికి పాజిటివ్.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేక ఆంక్షలు