అడవిలో ఉండాల్సిన చిరుత జనావాసాల్లోకి చేరింది. సోమవారం తెల్లవారు జామున పుణె(Pune) జిల్లాలోని చకాన్‌లో ఉన్న మెర్సిడెస్-బెంజ్ ప్లాంట్‌లోకి ఓ చిరుత ప్రవేశించింది. కంపెనీ గోడ దూకిన చిరుత (Leopard) లోపలికి ప్రవేశించింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి కార్మికులు భయంతో వణికిపోయారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది.. అటవీ అధికారులు, వాలంటీర్లు ట్రాంక్విలైజర్ డార్ట్‌ను ఉపయోగించి ఉదయం 11.30 గంటలకు చిరుతను బంధించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. అనంతరం చిరుత(Cheetah) ను అటవీ ప్రాంతంలో వదిలేశారు. పుణె శివార్లలోని అటవీప్రాంతం బెంజ్ కంపెనీలోకి చిరుత వచ్చినట్లు తెలుస్తోంది.
తెల్లవారుజామున 5 గంటలకు చిరుతపులి కనిపించినట్లు కంపెనీ అధికారుల నుంచి తమకు సమాచారం అందిందని ఓ అధికారి చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఉదయం నుంచి పోలీసు బృందం అక్కడ మోహరించినట్లు ఆయన వెల్లడించారు. పుణె శివార్లలోని అటవీప్రాంతం బెంజ్ కంపెనీలోకి చిరుత వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
Crime news: వేరొకరితో ప్రియుడి పెళ్లి.. తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య.. మరో ట్విస్ట్ ఏంటంటే