ఢిల్లీ కాలుష్యం పై టైటానిక్ హీరో పోస్ట్

|

Nov 19, 2019 | 4:09 PM

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న వాయుకాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలియచేసాడు. గతంలో చెన్నై వాటర్ క్రైసిస్ పైన కూడా డీకాప్రియో తన ఆందోళనను వ్యక్తం చేసాడు.. రీసెంట్ గా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసనకారులు ఆందోళన చేస్తున్న ఫోటోలను కొన్నింటిని పోస్ట్ చేశారు. ‘ అక్కడ దాదాపు 1500 మంది చేరి వాతావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వరల్డ్ హెల్త్ […]

ఢిల్లీ కాలుష్యం పై టైటానిక్ హీరో పోస్ట్
Follow us on

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న వాయుకాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలియచేసాడు.

గతంలో చెన్నై వాటర్ క్రైసిస్ పైన కూడా డీకాప్రియో తన ఆందోళనను వ్యక్తం చేసాడు.. రీసెంట్ గా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసనకారులు ఆందోళన చేస్తున్న ఫోటోలను కొన్నింటిని పోస్ట్ చేశారు. ‘ అక్కడ దాదాపు 1500 మంది చేరి వాతావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఇండియాలో ప్రతి ఏడాది 15లక్షల మంది కాలుష్యం వల్ల మరణిస్తున్నారు. ఈ లెక్కన ప్రపంచంలో కాలుష్యం వల్ల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ ఐదో స్థానంలో ఉంది’ అని లియోనార్డో డికాప్రియో పోస్ట్ చేశాడు.

ఎన్ని పోరాటాలు చేసినా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఏమాత్రం మెరుగవ్వలేదని, పెరిగిపోతున్న కాలుష్యంపై మౌనం వీడి అందరూ తప్పనిసరిగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు లియోనార్డో డికాప్రియో.