AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక సరిహద్దులపై మరింతగా అంతరిక్ష నిఘా.. ఇస్రోదే ఈ ఘనత !

అంతరిక్షం నుంచి సరిహద్దుల భద్రతపై నిఘా మరింతగా పెరగనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా చేసిన ఈ ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఆకాశం నుంచే బోర్డర్లో పరిస్థితిపై నిరంతరం నిఘా పెట్టేందుకు మూడు ఉపగ్రహాలను (సర్వేలెన్స్ శాటిలైట్స్) లాంచ్ చేసేందుకు ఈ సంస్థ సమాయత్తమవుతోంది. వీటిలో ఒకదానిని ఈ నెల 25 న, రెండింటిని డిసెంబరులో ప్రయోగించబోతోంది. ఈ మూడు శాటిలైట్స్ తో బాటు మూడు పీఎస్ఎల్వీ రాకెట్లు.. రెండు డజన్ల విదేశీ […]

ఇక సరిహద్దులపై మరింతగా అంతరిక్ష నిఘా.. ఇస్రోదే ఈ ఘనత !
Anil kumar poka
|

Updated on: Nov 19, 2019 | 3:55 PM

Share

అంతరిక్షం నుంచి సరిహద్దుల భద్రతపై నిఘా మరింతగా పెరగనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా చేసిన ఈ ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఆకాశం నుంచే బోర్డర్లో పరిస్థితిపై నిరంతరం నిఘా పెట్టేందుకు మూడు ఉపగ్రహాలను (సర్వేలెన్స్ శాటిలైట్స్) లాంచ్ చేసేందుకు ఈ సంస్థ సమాయత్తమవుతోంది. వీటిలో ఒకదానిని ఈ నెల 25 న, రెండింటిని డిసెంబరులో ప్రయోగించబోతోంది. ఈ మూడు శాటిలైట్స్ తో బాటు మూడు పీఎస్ఎల్వీ రాకెట్లు.. రెండు డజన్ల విదేశీ నానో, మైక్రో శాటిలైట్స్ ని మోసుకువెళ్తాయి. నవంబరు 25 వ తేదీ ఉదయం 9 గంటల 28 నిముషాలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించే పీఎస్ఎల్వీసీ-47 రాకెట్.. మూడో జనరేషన్ భూ పరిశీలన శాటిలైట్ ‘ కార్టోశాట్-3 ‘ ని తీసుకువెళ్లనుంది. ఈ రాకెట్ ప్రైమరీ పే లోడ్ తో బాటు అమెరికా నుంచి సేకరించిన 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలను కూడా మోసుకువెళ్తుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ నానో శాటిలైట్ల వాణిజ్య డీల్ కు సంబంధించి కొత్తగా ఏర్పాటైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. కార్టోశాట్-3 ని 97.5 డిగ్రీల ఏటవాలున 509 కిలో మీటర్ల కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇక రీశాట్-2 బీఆర్ఐ, రీశాట్-2 బీఆర్-2 అనే మరో రెండు నిఘా శాటిలైట్స్ ని కూడా ఇస్రో లాంచ్ చేయనుంది. డిసెంబరులో శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీసీ-48, సీ 49 రాకెట్ల సాయంతో వీటిని ప్రయోగిస్తారు. ఇస్రో గతంలో.. ఏప్రిల్ 1 న ఎమిశాట్ సర్వేలెన్స్ శాటిలైట్ ని, మే 22 న రీశాట్-2 బీ నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. జపాన్ కు చెందిన క్యూఐపీఎస్ సంస్థ రెండు మైక్రో శాటిలైట్స్ ని అభివృధ్ది పరచింది. వీటిని ఇస్రో లాంచ్ చేయబోతోంది.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే