AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెప్పేది వినండి…. మమ్మల్ని భయపెట్టకండి

లోక్ సభలో సోమవారం హోమ్ మంత్రి అమిత్ షా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య తీవ్ర వాగ్యుధ్ధం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ ఐ ఏ ) సవరణ బిల్లు-2019 పై చర్చ సందర్భంగా ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకునేంత వరకూ వెళ్ళింది. ఈ సంస్థకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఈ సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. భారతీయులపైనా, విదేశాలలో భారతీయులతో సహా భారతీయ సంస్థల పైనా ఉగ్రవాద దాడులు, సంబంధిత ఉగ్రవాద […]

చెప్పేది వినండి.... మమ్మల్ని భయపెట్టకండి
Pardhasaradhi Peri
|

Updated on: Jul 16, 2019 | 11:46 AM

Share

లోక్ సభలో సోమవారం హోమ్ మంత్రి అమిత్ షా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య తీవ్ర వాగ్యుధ్ధం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ ఐ ఏ ) సవరణ బిల్లు-2019 పై చర్చ సందర్భంగా ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకునేంత వరకూ వెళ్ళింది. ఈ సంస్థకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఈ సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. భారతీయులపైనా, విదేశాలలో భారతీయులతో సహా భారతీయ సంస్థల పైనా ఉగ్రవాద దాడులు, సంబంధిత ఉగ్రవాద చర్యలపై దర్యాప్తు జరిపేందుకు ఈ సంస్థకు తాజాగా మరిన్ని పవర్స్ కల్పించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. అలాగే సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి కేసుల దర్యాప్తునకు కూడా దీనికి అధికారం ఉంటుంది. అయితే మొదట దీనిపై చర్చ సందర్భంగా ఎం ఐ ఎం అధినేత ఒవైసీ.. విరుచుకపడ్డారు. ఎవరో ఒకరిపై దర్యాప్తు జరపడానికి ఎన్ ఐ ఏ అధికారిని విదేశాలకు పంపే అధికారాలను మీరెలా ఇస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఇతరుల సార్వభౌమాధికారాల్లో జోక్యం చేసుకునేలా మమ్మల్ని అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో పోల్చకండి అని తీవ్ర స్వరంతో అన్నారు. జాతీయ ప్రయోజనాలంటే అర్థం లేని నిర్వచనాన్ని బిల్లులో ఎలా చేరుస్తారని ఒవైసీ ప్రశ్నించారు. కాగా-హైదరాబాద్ లో మక్కా మసీదు పేలుడు కేసులో నిందితుల్ని అరెస్టు చేయకుండా ఆ నగర పోలీసు కమిషనర్ ను అడ్డుకున్నారంటూ బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ చేసిన ఆరోపణలను ఒవైసీ ఖండించడంతో.. ఆయనకు, అమిత్ షాకు మధ్య వాగ్వివాదం మొదలైంది. హైదరాబాద్ లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు కమిషనర్ మైనారిటీలలో కొంతమంది అనుమానితులను అరెస్టు చేశారని, అప్పుడు సీఎం స్వయంగా ఆయనను పిలిపించి అలా చేయవద్దని, ఆదేశించారని, లేకపోతే ఉద్యోగానికి ఉద్వాసన తప్పదని హెచ్చరించారని సత్యపాల్ సింగ్ గుర్తు చేయగా.. అయితే ఇందుకు ఆధారాలు చూపాలంటూ ఒవైసీ సవాల్ విసిరారు. ఈ దశలో సభలో తీవ్ర గలాభా మొదలైంది. అసలు సత్యపాల్ సింగ్ ఏం చెబుతున్నారో మొదట మీరు వినాలని అమిత్ షా..ఒవైసీని ఉద్దేశించి అన్నారు. ‘ మేమంతా సహనంతో విన్నాం.. మీరు కూడా వినడం నేర్చుకోండి.. సభ ఇలా సాగడం మంచిది కాదు ‘ అని చేతి వేలు చూపుతూ హెచ్ఛరింత పని చేశారు. ఇందుకు మండిపడిన ఒవైసీ.. మీరు చేతివేలు చూపినంత మాత్రాన మేం భయపడే ప్రసక్తి లేదు ‘ అని అన్నారు. అనంతరం.. శాంతించిన అమిత్ షా.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కి విశేష అధికారాలు కల్పించడంలో సభలోని సభ్యులంతా ఆమోదం తెలపాలని కోరారు.