AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విద్యార్ధుల హాస్టళ్లలో ఫ్యాన్‌లకు పంజరాలు.. నెట్టింట పేలుతున్న జోకులు! అసలు ముచ్చట ఇదే..

కోటా హాస్టళ్లలో ఫ్యాన్‌లకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కోచింగ్ రాజధాని పేలవమైన విద్యాసంరక్షణ విధానాలు అందరి దృష్టిని కేంద్రీకరించింది. ఇందులో విద్యార్ధుల ఆత్మహత్యలను నివారించేందుకు హాస్టళ్లలోని సీలింగ్ ఫ్యాన్‌ల చుట్టూ భారీ ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. ఇవి విద్యార్ధుల ఆత్మహత్యలను ఆపుతాయా? అనే సందేహం సర్వత్రా నెలకొంది..

Viral Video: విద్యార్ధుల హాస్టళ్లలో ఫ్యాన్‌లకు పంజరాలు.. నెట్టింట పేలుతున్న జోకులు! అసలు ముచ్చట ఇదే..
Iron Cages For Ceiling Fans In Kota Hostels
Srilakshmi C
|

Updated on: May 03, 2026 | 5:47 PM

Share

కోటా, మే 3: పోటీ పరీక్షల హబ్‌ కోటాలో యేటా వందలాది మంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్ధుల ఆత్మహత్యల నివారణకు కోటాలోని హాస్టళ్లు సీలింగ్ ఫ్యాన్‌ల చుట్టూ రక్షణ కోసం ఇనప పంజరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ చర్య భద్రతాపరమైనదే అయినా ఇందుకు అయ్యే ఖర్చు చర్చకు దారితీసింది.

ఈ వీడియోలో ఐఐటీ-జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు వేలాది మంది కోచింగ్‌ తీసుకునేందుకు కోటాలోని పలు కోచింగ్ సెంటర్లకు వస్తుంటారు. ఇటీవల కాలంలో అక్కడ విద్యార్ధుల మరణాలు లెక్కకు మించి పెరిగడంతో అధికారులు, హాస్టల్‌ నిర్వహాకులు వివిధ నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అందులో భాగంగా ఓ హాస్టల్‌ నిర్వాహకులు సీలింగ్ ఫ్యాన్‌ల చుట్టూ అధిక బరువు పడినప్పుడు ఊడిపోయేలా ఇనుప పంజరాలు ఏర్పాట్లు చేశారు. ఫ్యాన్‌ల చుట్టూ మెటల్ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు కనిపిస్తున్న ఈ వీడియోలో.. కోటాలోని అన్ని హాస్టళ్లలో ఈ ఏర్పాట్లు ఉన్నాయో.. లేదో.. నిర్ధారించలేదు. అందిన సమాచారం ప్రకారం ఈ ఐరన్‌ పంజరాలను ఏర్పాటు చేయడానికి ఒక్కో ఫ్యాన్‌కు దాదాపు రూ.12 వేలు ఖర్చు అవుతుంది. సీలింగ్ ఫ్యాన్‌ల ఖరీదు కేవలం రూ.3,000 మాత్రమే ఉంటే.. గ్రిల్ ఏర్పాటుకు ఏకంగా రూ.9 వేలు ఖర్చు అవుతుంది.

దీంతో నెట్టింట కొందరు యూజర్లు ఈ అతి జాగ్రత్త చర్యలపై జోకులు పేలుస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి విషయాలను తేలికగా తీసుకోకూడదని, హాస్టల్‌ యాజమన్యాల ప్రయత్నాలకు మద్ధతు తెలుపుతున్నారు. దీంతో ఈ వీడియోకు సంబంధించిన ఫొటోలు, క్లిప్‌లు సోషల్ మీడియాలో చర్చలు, మీమ్స్‌కు దారితీశాయి. చాలామంది దీనిని దేశీ జుగాడ్, ఓవర్‌ఇంజనీరింగ్‌ల క్లాసిక్ మిశ్రమం అని వ్యంగ్యాస్రాలు విసురుతుంటే.. మరికొందరు ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రశంసించారు. వీళ్లు అన్నీ చేస్తారు కానీ విద్యా వ్యవస్థను మాత్రం మెరుగుపరచరు అని విమర్శలు విసురుతున్నారు. కోటాలో ఇంజనీర్లు, డాక్టర్లను కాకుండా.. ఆత్మహత్య చేసుకునేవారిని తయారు చేస్తుందని రుజువైందని మరొక యూజర్ ఎద్దేవా చేశాడు. ఇంతకీ మీరేమంటారు..?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
NEET UG 2026 కౌన్సెలింగ్‌.. సీట్ల కేటాయింపు ఫలితాలు వాయిదా..!
NEET UG 2026 కౌన్సెలింగ్‌.. సీట్ల కేటాయింపు ఫలితాలు వాయిదా..!
సూపర్‌‌ కార్ల రేసులోకి డచ్ సంస్థ రీ ఎంట్రీ.. పూర్తి వివరాలు
సూపర్‌‌ కార్ల రేసులోకి డచ్ సంస్థ రీ ఎంట్రీ.. పూర్తి వివరాలు
ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.
ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. కొత్తగా వారికి కూడా..
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. కొత్తగా వారికి కూడా..
టాటా ఎస్‌యూవీల్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏది
టాటా ఎస్‌యూవీల్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏది
గిరినాగుతో అట్లుంటాది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. 
గిరినాగుతో అట్లుంటాది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. 
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర