ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది. ఈసారి గౌరీకుండ్‌లో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 13 మంది శిథిలాల కింద సమాధి అయ్యారు. ఈ ప్రమాదం గురువారం అర్థరాత్రి జరిగింది. కొండపై నుంచి బండరాళ్లు నిరంతరం పడిపోతుండడంతో రెస్క్యూ టీమ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రుద్రప్రయాగ్ పోలీస్, SDRF, DDRF సహా అనేక బృందాలు రెస్క్యూలో నిమగ్నమై ఉన్నాయి. అయితే శిథిలాల కింద ఉన్న వ్యక్తుల గురించి సమాచారం తెలియాల్సి ఉంది.
మరోవైపు రుద్రప్రయాగ్‌లోని గౌరీకుండ్‌లో గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ భారీ వర్షాల కారణంగా కొండపై కొండచరియలు విరిగిపడి రెండు దుకాణాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో దుకాణాల్లో పనిచేస్తున్న సుమారు 13 మంది శిథిలాల కింద సమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కొంతసేపటికి జిల్లా యంత్రాంగం, జిల్లా విపత్తు నిర్వహణ, SDRF, DDRF బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో ఇతర దుకాణాల్లో ఉన్నవారు.. శిధిలాల కింద ఉన్న బాధితులను రక్షించలేకపోయారు. శిధిలాల కింద ఉన్నవారు కొందరు స్థానికులు కాగా మరికొందరు నేపాల్‌కు చెందిన వారుగా తెలుస్తోంది.
उत्तराखंड के गौरीकुंड के पास लैंडस्लाइड, मलबे में 10-12 लोगों के दबे होने की आशंका#Uttrakhand | #Landslide | @Surbhi_R_Sharma | @AbhijeetThakurJ pic.twitter.com/tAZC8ip4p6
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) August 4, 2023
రాత్రి 12 గంటల సమయంలో డాక్ పులియా సమీపంలో కొండచరియలు విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్‌వార్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే అక్కడికక్కడే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించగా భారీ వర్షాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. శిథిలాల కింద కొంత మంది సమాధి అయ్యారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
విపత్తు నిర్వహణ బృందం శిథిలాల కింద ఉన్న 13 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది. అయితే ఈ వ్యక్తులు గల్లంతయ్యారా లేక నదిలో కొట్టుకుపోయారా లేక శిథిలాల కింద సమాధి అయ్యారా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ విషయాన్ని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఇంకా ధృవీకరించలేదు. అయితే బాధితుల జాబితాను విడుదల చేసింది. కొండపై నుంచి బండరాళ్లు, శిథిలాలు నిరంతరం పడిపోతున్నాయి. దీంతో సహాయక చర్యలు చేయడంలో ఆలస్యం జరుగుతుందని విపత్తుల నిర్వహణ బృందం పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..