Temple Elephant: వినాయకుడి ఆలయంలోని గజరాజు ‘లక్ష్మి’ మృతి.. శోకసంద్రంలో మునిగిన భక్తులు, స్థానికులు..

పురాతన వినాయకుడి ఆలయానికి చెందిన ఓ ఏనుగు గుండెపోటుతో మృతిచెందింది. దీంతో భక్తులు శోకసంద్రంలో మునిగారు. ఈ విషదా ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.

Temple Elephant: వినాయకుడి ఆలయంలోని గజరాజు ‘లక్ష్మి’ మృతి.. శోకసంద్రంలో మునిగిన భక్తులు, స్థానికులు..
Temple Elephant

Updated on: Nov 30, 2022 | 5:49 PM

Temple Elephant Dies: పురాతన వినాయకుడి ఆలయానికి చెందిన ఓ ఏనుగు గుండెపోటుతో మృతిచెందింది. దీంతో భక్తులు శోకసంద్రంలో మునిగారు. ఈ విషదా ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. పుదుచ్చేరిలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ మనాకుల వినాయక ఆలయానికి చెందిన ఓ ఏనుగు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందింది. నడక కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో ఏనుగు మరణించినట్లు గణేష్ ఆలయ సిబ్బంది వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని ఏనుగు పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆలయానికి చేరుకొని గజరాజుకు నివాళులర్పించారు. ఆలయానికి ఎప్పుడు వచ్చినా.. ‘లక్ష్మీ’ ఆశీర్వాదాలు ఇచ్చేదంటూ గవర్నర్ మునుపటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని విచారం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

లక్ష్మీ అనే ఈ ఏనుగును 1995లో మనాకుల వినాయక ఆలయానికి ఓ వ్యాపారవేత్త విరాళంగా అందజేశారు. అప్పటి నుంచి లక్ష్మీ అక్కడికి వచ్చే భక్తులకు ఆశీర్వాదం అందజేస్తూ విశేష ఆదరణ పొందింది. విదేశీయులు, స్థానికులు లక్ష్మీ ఆశీర్వాదాలు తీసుకుంటూ సంబరపడిపోయేవారు. స్వామి దర్శనంతో పాటు ఆలయ ఏనుగు దర్శనానికి జనం బారులు తీరేవారని ఆలయ సిబ్బంది తెలిపారు.

Elephant

లక్ష్మీని ఈ రోజు ఉదయం నడక కోసం బయటకు తీసుకెళ్లామని.. అప్పుడు కుప్పకూలినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో వెంటనే వైద్యులను పిలిపించామని.. అప్పటికే మరణించినట్లు వెల్లడించారన్నానరు. లక్ష్మి (ఆలయ ఏనుగు) మృతి చెందదిందని తెలుసుకున్న స్థానికులు, భక్తులు రోదిస్తూ నివాళులర్పించేందుకు బారులు తీరారు. లక్ష్మీ కడసారి చూపు కోసం కిలోమీటర్ల దూరం బారులు తీరి నివాళులర్పించారు.

Temple Elephant Dies

మరిన్ని జాతీయ వార్తల కోసం..