Gang rape: యువకుడిపై నలుగురు యువతుల గ్యాంగ్ రేప్.. మత్తుమందు చల్లి తాళ్లతో కట్టేసి దారుణం.. వీడియో.
ఇప్పటి వరకు యువతులు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుతం ఓ వెరైటీ కేసు వెలుగులోకి వచ్చింది.
జలంధర నగరంలోని కపుర్తలా రోడ్డులో ఓ యువకుడు పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడికి ఓ కారులో వచ్చిన అమ్మాయిలు.. ఆ యువకుడిపై మత్తుమందు చల్లారు. అతడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. పూటుగా మద్యం తాగిన ఆ యువతులు ఆ యువకుడిని కూడా మద్యం తాగాలని బలవంతం చేశారు. అనంతరం అతడిని తాళ్లతో కట్టి, అత్యాచారం చేశారు. తెల్లవారు జామున 3 గంటలకు అదే కారులో యువకుడిని ఎక్కించుకుని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఉదయం స్పృహ వచ్చాక ఆ యువకుడు తనపై అత్యాచారం జరిగిందని గుర్తించాడు. వెంటనే ఓ వీడియో విడుదల చేశాడు. తనపై అత్యాచారం జరిగిందని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన పరువు పోతుందని, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియో వైరల్ గా మారడంతో జలంధర్ డీసీపీ జగన్మోహన్ సింగ్ స్పందించారు. తమ వద్దకు ఇలాంటి కేసు ఏదీ రాలేదని, ఏ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

