పరీక్షల భయంతో ఆ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రాయని లక్ష మంది విద్యార్థులు

|

Mar 30, 2023 | 5:32 PM

పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని పై చదువులకు వెళ్లాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు. మరికొందరైతే పాసైతే చాలు అని అనుకుంటారు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు మంచి మార్కులు రావాలని కోరుకుంటారు.

పరీక్షల భయంతో ఆ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రాయని లక్ష మంది విద్యార్థులు
Tenth Class Exams
Follow us on

పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని పై చదువులకు వెళ్లాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు. మరి కొందరైతే పాసైతే చాలు అని అనుకుంటారు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు మంచి మార్కులు రావాలని కోరుకుంటారు. అయితే తమిళనాడులో మాత్రం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు భయపడి దాదాపు లక్ష మంది విద్యార్థులు పాఠశాలకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో లక్ష మందికి పైగా విద్యార్థులు పాఠశాలకు రావడం మానేసినట్లు వెల్లడైంది.

తమిళనాడు వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించిన సర్వేలు ఈ గణాంకాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్ష రాయని విద్యార్థులందరినీ పరీక్షలు రాయించేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. గైర్వాజరైన విద్యార్థుల పేర్లు, వివరాలు సేకరించి పరీక్షకు తీసుకురావాలని.. ఆ బాధ్యత సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని తెలిపింది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..