Honour killing: మరో పరువు హత్య.. 5 రోజులకే ముగిసిపోయిన మూడుముళ్ల బంధం

తాజాగా తమిళనాడు కుంభకోణంలో మరో పరువు హత్య జరిగింది. నవ దంపతులను అతి దారుణంగా హతమార్చారు.

Honour killing: మరో పరువు హత్య.. 5 రోజులకే ముగిసిపోయిన మూడుముళ్ల బంధం
Kumbakonam Honor Killing

Edited By:

Updated on: Jun 14, 2022 | 3:20 PM

మరో పరువు హత్య రెండు నిండుజీవితాలను కూల్చేసింది. వేరే కులం లేదా మతానికి చెందిన వారిని ప్రేమించిన పాపానికి నిండునూరేళ్లు జీవించాల్సిన పిల్లల జీవితాలు మధ్యలోనే ముగిసిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో వరుస పరువు హత్యలు కలకలం రేపాయి. తాజాగా తమిళనాడు కుంభకోణంలో మరో పరువు హత్య జరిగింది. నవ దంపతులను అతి దారుణంగా హతమార్చారు. వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుందనే అక్కసుతో యువతి కుటుంబసభ్యులు ఘాతుకానికి తెగబడ్డారు. పెళ్లైన నాలుగు రోజులకే నవ దంపతులను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని తులుక్కవేళి గ్రామానికి చెందిన యువతి చెన్నైలో నర్సుగా పనిచేస్తోంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని సైతం ఆమె చెన్నైకి తీసుకెళ్లి, ట్రీట్మెంట్ చేయిస్తోంది. ఈ క్రమంలో 5 నెలల కిందట ఆసుపత్రిలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు ఇష్టం లేకపోయినా అందరినీ ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిని అంగీకరించని యవతి సోదరుడు వారిపై కసి పెంచుకున్నాడు. ఎలాగైన పగతీర్చుకోవాలని భావించాడు.

పథకం ప్రకారం సోదరికీ ఫోన్ చేశాడు. తాను పెళ్లిని అంగీకరిస్తున్నట్టు నమ్మించాడు. ఇద్దరినీ తమ బంధువు ఇంటికి రావాలని ఆహ్వనించాడు. పెళ్లైన ఐదో రోజే ఆమె తన భర్తతో కలిసి బంధువుల ఇంటికి చేరింది. పాపం అదే వారికి ఆఖరు రోజుగా మారింది. బందువు ఇంట్లోనే నవదంపతులను అతి దారుణంగా హత్యచేశారు.పెళ్లి జరిగిన ఐదో రోజే నవ దంపతులు ఇద్దరూ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us