ఢిల్లీ వేదికగా ‘గ్లోబల్ కాన్ఫెరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్’ సమ్మిట్.. మెడిటేషన్‌పై కీలక ప్రసంగాలు..

ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగాఫిబ్రవరి 20-23 మధ్య 'గ్లోబల్ కాన్ఫెరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్' సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌లో పలువురు ప్రముఖులు మెడిటేషన్‌పై పలు కీలక ప్రసంగాలు ఇవ్వనున్నారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ చీఫ్ గెస్ట్‌గా విచ్చేస్తారు.

ఢిల్లీ వేదికగా గ్లోబల్ కాన్ఫెరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ సమ్మిట్.. మెడిటేషన్‌పై కీలక ప్రసంగాలు..
Gcml 2025

Updated on: Feb 18, 2025 | 5:03 PM

ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగాఫిబ్రవరి 20-23 మధ్య ‘గ్లోబల్ కాన్ఫెరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్’ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌లో పలువురు ప్రముఖులు మెడిటేషన్‌పై పలు కీలక ప్రసంగాలు ఇవ్వనున్నారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ చీఫ్ గెస్ట్‌గా విచ్చేస్తారు. చంద్ర పులమరశెట్టి, అమితాబ్ కాంత్, పద్మభూషణ్ కమలేశ్ పటేల్, కొండవేటి న్యూటన్, కొండవేటి లక్ష్మి లాంటి పలు ప్రముఖులు ఈ సమ్మిట్‌లో తమ పవర్‌ఫుల్ స్పీచ్‌లతో ప్రజలను ఆలోచింపజేయనున్నారు.

సానుకూల సామాజిక మార్పును తీసుకురావడంలో ధ్యానం కీలక పాత్ర పోషిస్తుందని అవగాహన కల్పించడమే కాకుండా.. స్వీయ-సాధికారత కలిగిన వ్యక్తిగా తమను తాము మార్చుకోవడంలో మెడిటేషన్ దోహదపడుతుందని చెప్పడమే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, గ్లోబల్ ఆర్గనైజేషన్లు, కార్పొరేషన్లు, ఇతర సీనియర్ అధికారులు.. తమ సంస్థలు, సమాజంలో ధ్యానాన్ని వేగంగా పెంపొందించేందుకు విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించాలని సహాయపడాలన్నారు సమ్మిట్ నిర్వాహకులు.