ఇంటర్ విద్యార్థులకు ‘కిషోర్ సైంటిఫిక్’ పథకం.. ప్రతీ నెలా రూ. 5 నుంచి 7 వేలు స్టైఫండ్.. వివరాలివే..

|

Mar 02, 2021 | 5:30 PM

Kishore Scientific Incentive Scheme: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం మరో పధకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా....

ఇంటర్ విద్యార్థులకు కిషోర్ సైంటిఫిక్ పథకం.. ప్రతీ నెలా రూ. 5 నుంచి 7 వేలు స్టైఫండ్.. వివరాలివే..
Follow us on

Kishore Scientific Incentive Scheme: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం మరో పధకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా సైన్స్ సంబంధిత విద్యార్థులకు కిషోర్ సైంటిఫిక్ ప్రోత్సాహక పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద సైన్స్ రంగంలో అభ్యసించే విద్యార్థికి ప్రతీ నెలా రూ. 5 నుంచి 7 వేల వరకు ఇవ్వనున్నారు.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం మరో పధకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా సైన్స్ సంబంధిత విద్యార్థులకు కిషోర్ సైంటిఫిక్ ప్రోత్సాహక పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు డిగ్రీ చేస్తున్న విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందించనుంది. ఇక ఈ పధకాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పర్యవేక్షిస్తోంది. ఈ పథకానికి ‘కిషోర్ సైంటిఫిక్ ప్రోత్సాహక పథకం’ అని పేరు పెట్టగా.. దీని కింద సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ రంగాల్లో పనిచేసే విద్యార్థులకు ఫెలోషిప్ అందిస్తారు.

ప్రతీ నెలా విద్యార్థులకు రూ. 5 నుంచి 7 వేల లభిస్తాయి…

గత రెండు దశాబ్దాలుగా ‘కిషోర్ సైంటిఫిక్ ఇన్సెంటివ్ స్కీమ్’ (కెవిపివై) ఫెలోషిప్ సైన్స్ రంగంలో వృత్తిని కొనసాగించేందుకు విద్యార్థులకు సహాయపడుతూ వస్తోంది. ఈ పథకం కింద విద్యార్థులకు రెండు వేర్వేరు ఫెలోషిప్‌లు అందిస్తున్నారు. అందులో ఒకటి రూ .5 వేలు కాగా, మరొకటి రూ .7 వేలుగా ఉంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న విద్యార్థులు ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రెండు దశల్లో పరీక్ష…

ఈ పథకాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం 1999 సంవత్సరంలో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సైన్స్ రంగంలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ఈ పధకం ప్రధాన లక్ష్యం. తద్వారా దేశ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడుతుందని వారి భావన. జాతీయ స్థాయిలో విద్యార్థులను ఎంపిక చేయడం కోసం ఈ పథకం కింద ఉన్నత స్థాయి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్ష కాగా.. రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది.

ఈ పధకానికి అర్హతలు ఇలా ఉన్నాయి…

కెవిపివై ఫెలోషిప్‌కు అర్హతలు ఇలా ఉన్నాయి.. పదో తరగతి సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో విద్యార్థులు 75% మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీనితో పాటు షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు 10 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది. అదే సమయంలో, మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 12వ తరగతిలో 60 శాతం మార్కులు సాధించాల్సి ఉండగా.. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులు 10 శాతం సడలింపుతో 50 శాతం మార్కులు సాధించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!