Only one lack ventilators in 1.35 billion people in India: కరోనాపై సమరానికి ప్రతి ఒక్కరు సంఘీభావం తెలుపుతుండడం… ప్రభుత్వాల నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించడం చూస్తుంటే వైరస్ నియంత్రణలో మనం విజయం సాధిస్తామన్న నమ్మకం కలుగుతుంది. కానీ, దేశంలో ఇప్పటి వరకు ఉన్న వైద్య సౌకర్యాల్లో డొల్లతనం చూస్తే ఒకింత భయం కలుగక తప్పదు. తాజాగా కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి వెల్లడించిన ఓ కఠోర సత్యం తెలిస్తే ఇంత పెద్ద దేశంలో ఇంత తక్కువ వైద్య సౌకర్యాలా అన్న భయాందోళన కలుగక తప్పదు. గత ప్రభుత్వాలు వైద్య సౌకర్యాల కల్పనలో ఎలా విఫలం అయ్యాయో.. అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు సిద్ధంగా ఉండేందుకు ఏమి చేయలేకపోయాయి అన్న విషయం తేటతెల్లం అవుతాయి.
దేశంలో దాదాపు 135 కోట్ల మంది ప్రజలున్నారు. వైద్య సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇందుకు ఉదాహరణ తాజాగా కిషన్ రెడ్డి వెల్లడించిన ఓ కఠోర సత్యం. దేశంలో అత్యవసర పరిసితి ఉత్పన్నం అయితే ఉపయోగించేందుకు కేవలం లక్ష.. ఎస్ అక్షరాలా లక్ష వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. 135 కోట్ల మందికి గాను కేవలం లక్ష వెంటిలేటర్లా అన్న ఆశ్చ్యర్యం కలుగున్నా ఇది అక్షరాలా నిజం. అంటే గత ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితి ఎదురైతే ఏ మాత్రం సిద్ధం కాలేవని తెలిసిపోతుంది. ఇక కిషన్ రెడ్డి మరిన్ని అంశాలను వెల్లడించారు.
ప్రధాని పిలుపునకు కులాలు, మతాలకు, సిద్ధాంతాలకు, పార్టీలకు అతీతంగా 130 కోట్ల మంది ప్రజలు ఎలా స్పందించారో అలాగే ఇకపై కొనసాగించాలని, వచ్చే 2 వారాలు చాలా కీలకమైనవని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా దేశం కరోనా స్టేజి 3 దశకు వెళ్లాద న్న ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఇటలీ, అమెరికా వంటి దేశాలే స్టేజి-3కి వెళ్లాయన్నారు కిషన్ రెడ్డి.
ఇప్పటి వరకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కలిపి మొత్తం 15,24,266 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించామని, ల్యాండ్ బోర్డర్ వద్ద 19 లక్షల మందికిపైగా స్క్రీనింగ్ చేశామని అయన వివరించారు. దేశవ్యాప్తంగా 94,963 క్వారంటైన్ బెడ్స్ సిద్ధం చేశామని, ప్రతిరోజూ 20 వేల మందికి కరోనా టెస్ట్ చేసే సామర్థ్యం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇతర దేశాల్లోని 2,040 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని, సుమారు 48 దేశాల నుంచి భారత ప్రభుత్వ ఖర్చుతో వారిని తీసుకొచ్చామని తెలిపారు.