Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెస్టైన వ్యక్తిని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్‌పై దాడి.. 3వేల మందిపై కేసులు..

ప్రజలు తమ సమస్యలు, డిమాండ్లపై నిరసనలు, ఆందోళనలు నిర్వహించడం సాధారణం. హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా నిరసనలు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు. ఒకవేళ నిరసనల వల్ల ఏదైనా..

అరెస్టైన వ్యక్తిని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్‌పై దాడి.. 3వేల మందిపై కేసులు..
Kerala Incident
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 29, 2022 | 5:40 AM

ప్రజలు తమ సమస్యలు, డిమాండ్లపై నిరసనలు, ఆందోళనలు నిర్వహించడం సాధారణం. హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా నిరసనలు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు. ఒకవేళ నిరసనల వల్ల ఏదైనా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే దానికి కారకులపై కేసులు నమోదు చేస్తారు. అదే నిందితులు వందల సంఖ్యలో ఉన్నప్పుడు వారిని గుర్తించి బాధ్యులపై కేసులు పెడుతుంటారు. అదే వేలమంది కలిసి ఆందోళన చేపట్టిన సందర్భంగా ఏదైనా ఇబ్బందులు తలెత్తితే సాధారణంగా అంతమందిలో నిందితులను గుర్తించడం కష్టం అవుతుంది. ఆకని కేరళలో పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులో ఏకంగా 3వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలో అదానీ ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళన కారులు విళింజం పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో3000 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధమైన సమావేశాల నిర్వహణ, అల్లర్లు, నేరపూరిత కుట్ర అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టయిన వారిలో పురుషులు, మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో దాదాపు 40 మంది పోలీసులతోపాటు పలువురు స్థానికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

ఓ కేసులో అరెస్టయిన వ్యక్తిని విడుదల చేయాలంటూ దాదాపు 3వేల మంది పోలీస్‌స్టేషన్‌పై మూకుమ్మడిగా దాడికి ప్రతయ్నించారని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో స్టేషన్‌ వద్దకు చేరుకొని భయానక వాతావరణం సృష్టించారని, అరెస్టు చేసిన వ్యక్తిని విడుదల చేయకపోతే పోలీస్‌ స్టేషన్‌ను ధ్వంసం చేస్తామని హెచ్చరించారని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని విడుదల చేయకపోడంతో హింసాత్మక దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనలో ఐదు పోలీసు వాహనాలతోపాటు స్టేషన్‌లోని విలువైన సామగ్రి ధ్వంసమైందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. దాదాపు రూ.85 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఈ దాడిని తిరువనంతపురం సిటీ పోలీస్‌ కమిషనర్‌ తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులు ఈ విధంగా దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదన్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో తిరువనంతపురం వ్యాప్తంగా ప్రత్యేక బలగాలను మోహరించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దాదాపు 900 మిలియన్ల డాలర్ల పెట్టుబడితో అదానీ సంస్థ తిరువనంతపురం సమీపంలోని విళింజంలో పోర్టు నిర్మాణం చేపడుతుండగా, దీనివల్ల తమ జీవనోపాధికి విఘాతం కలుగుతుందని స్థానిక మత్యకారులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు పనులకు ఆటంకం కలిగింది. అయితే, ఇటీవల అదానీ గ్రూప్‌నకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో పనులు పునఃప్రారంభించేందుకు ఆ సంస్థ ప్రయత్నించింది. భారీ యంత్రాలను నిర్మాణ ప్రదేశంలోకి తరలిస్తుండగా.. ప్రధాన గేటు వద్ద స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..