AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ శుభలేఖ చూడటానికి రెండు కళ్లు సరిపోవు.. అతిథులు షాక్..!

వివాహది శుభకార్యాలకు సామాజిక మాధ్యమాలు ద్వారా ఆహ్వానాలు పలికే నేటి రోజుల్లో హిందూ వివాహం విశిష్టత పెళ్లి మండపంలో జరిగే ఘట్టాలు వివరిస్తూ ఏకంగా ముప్ప్పై ఆరు పేజీల ఆహ్వాన పత్రికతో తన కూతురి వివాహానికి ఆహ్వానిస్తుంది కరీంనగర్ జిల్లా లోని ఓ కుటుంబం.

ఈ శుభలేఖ చూడటానికి రెండు కళ్లు సరిపోవు.. అతిథులు షాక్..!
Variety Wedding Card
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 20, 2025 | 10:27 PM

Share

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్-శ్రీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. మొదటి కూతురు రవళిక సీఏ పూర్తి చేసింది. ఇటీవలే కామారెడ్డి పట్టణానికి చెందిన నాగేంద్ర బాబుతో ఫిబ్రవరి 23వ తేదీన వివాహం నిశ్చయమైంది. తమ వివాహ వేడుక అందరికి గుర్తుండిపోయేలా నిర్వహించాలనుకున్నారు. ఇందులో భాగంగా వివాహానికి బందు మిత్రులను ఆహ్వానించడానికి ఏకంగా 36 పేజీలతో వివాహ విశిష్టత అంశాలను పేర్కొంటూ పెళ్లి పుస్తకాన్ని ముద్రించారు.

వెడ్డింగ్ కార్డు అందరిలా ఉంటే ఏం బాగుంటుందనుకున్నది ఆ కుటుంబం. వివాహ ఆహ్వాన పత్రికను పుస్తకం రూపంలో ప్రింట్ చేయించారు. వివాహానికి సంబంధించిన కళ్యాణ సంస్కృతి, పెళ్లిచూపులు, పాణిగ్రహణ శుభ ముహూర్త పత్రిక, పెళ్లి కుమార్తెను చేయుట, పెళ్లి కుమారుని చేయుట, వరపూజ, వధువును గంపలో తీసుకు వచ్చే తంతు, తెరసాల, కన్యా ఫలం, మాంగల్య పూజ, జిలకర బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మముడి సప్తపది, ఉంగరాలు తీయించుట, అప్పగింతల పాట తోపాటు పెళ్లిలో జరిగే 36 తంతుల గురించి ఒక్కొక్క పేజీలో ముద్రించి తన కుమార్తె వివాహానికి అందరూ రావాలంటూ అందరినీ ఆహ్వానిస్తున్నారు సుద్దాల దంపతులు.

ఉన్నత చదువులు చదివిన వధువు కూడా తమ సంప్రదాయ సంస్కృతి ఆచరించి తన వివాహం చేయడం తనకు సంతోషంగా ఉండంటుంది. పెళ్లి పత్రికే ఈ రకంగా ఉంటే వివాహం ఎలా చేస్తారో అని ఆత్రుతగా చూస్తున్నారు బంధు మిత్రులు..ఈ పెళ్లి కార్డును ఆసక్తి చూస్తున్నారు. ఈ పెళ్లి కార్డును స్వయంగా అమ్మాయి తరుపున బంధువులు పంపిణి చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!