AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులపై వేధింపుల కేసులో భారీ ట్విస్ట్‌! టార్గెట్లు కాదు.. అసలు నిజం బయటపెట్టిన పోలీసులు!

కొచ్చిలోని మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగులను అవమానించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఈ కేసులో ట్విస్ట్ బయటపడింది. టార్గెట్లు చేరకపోవడం వల్ల కాదు, గత మేనేజర్ తన మాజీ యజమానిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కుట్ర చేశాడని పోలీసులు తెలిపారు. ట్రైనీ ఉద్యోగులను బలవంతంగా వీడియో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఉద్యోగులపై వేధింపుల కేసులో భారీ ట్విస్ట్‌! టార్గెట్లు కాదు.. అసలు నిజం బయటపెట్టిన పోలీసులు!
Kochi
SN Pasha
|

Updated on: Apr 07, 2025 | 7:40 PM

Share

కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పని చేసే ఉద్యోగులు టార్గెట్లు పూర్తి చేయలేదని, వారి మెడలో బెల్ట్‌ కట్టి కుక్కల్లా నడిపిస్తూ అవమానించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగులను మరీ ఇంతలా హింసిస్తారా? అంటూ మండిపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కూడా చేపట్టారు. తాజాగా ఈ కేసులో భారీ ట్విస్ట్‌ బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు టార్గెట్లు రీచ్‌ కాలేదని అలా చేయలేదని, ఆ కంపెనీలో గతంలో పనిచేసిన ఓ మేనేజర్‌కు కంపెనీ ఓనర్‌తో విబేధాలు ఉన్నాయి. అతను ఎలాగైనా తన యాజమానిని ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడు. నాలుగు నెలల క్రితం కంపెనీలో జాయిన్‌ అయిన ట్రైనీ ఉద్యోగులను ట్రైనింగ్‌ పేరుతో ఇలా బట్టలు విప్పించి, కుక్కల్లా మెడలో బెల్ట్‌ కట్టి, వారిని కుక్కల్లా నడిపించాడు. ఫన్‌ యాక్టివిటీలో భాగంగా ఇలా చేస్తున్నామంటూ ఉద్యోగులను నమ్మించాడు. సరదాగా చేస్తున్న వాటిని వారికి తెలియకుండా వీడియో తీసి.. ఇప్పుడు కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత.. కంపెనీ పరువు తీసేందుకు వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి, ఉద్యోగులను కంపెనీ ఇలా వేధిస్తోందంటూ ప్రచారం చేశాడు.

నిజానికి కంపెనీలో టార్గెట్ల కోసం ఉద్యోగులను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదని, ఆ వీడియోలో ఉన్న ఓ వ్యక్తి పోలీసులు వెల్లడించాడు. తాను ఇంకా ఆ కంపెనీలోనే పనిచేస్తున్నానని, ఆ రోజు పాత మేనేజర్‌ చేయించిన విషయాన్ని అతను పోలీసులకు వెల్లడించాడు. దీంతో.. పోలీసులు పాత మేనేజర్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ సంఘటన కలూర్‌ సమీపంలోని పెరుంబవూర్‌లో ఒక ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే