వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంపై ముందస్తు హెచ్చరిక అన్న అమిత్ షా.. నిరుపించమని సీఎం సవాల్

|

Aug 01, 2024 | 9:35 AM

వాయనాడ్‌లో విధ్వంసకర కొండచరియలు విరిగిపడటానికి వారం రోజుల ముందు కేరళకు కేంద్రం హెచ్చరిక జారీ చేసిందని, అయితే కేంద్ర హెచ్చరికలను .. చెప్పిన విషయన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెంటనే తోసిపుచ్చారని హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్నారు. “జులై 23న భారత ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరిక చేసింది. తర్వాత జూలై 24, 25 తేదీల్లో ముందస్తు హెచ్చరికలు ఇచ్చారని.. జూలై 26న, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే అవకాశాల ఉంది కనుక తగు జాగ్రత్తలు.. ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కేరళ ప్రభుత్వానికి హెచ్చరించింది అని రాజ్యసభలో విపత్తుపై చర్చ సందర్భంగా షా చెప్పారు

వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంపై ముందస్తు హెచ్చరిక అన్న అమిత్ షా.. నిరుపించమని సీఎం సవాల్
Kerala Landslides
Follow us on

కేరళలోని వాయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి ప్రకృతి సృష్టించిన భీభత్సంలో ఏకంగా గ్రామాలకు గ్రామాలే కనుమరుగయ్యాయి. నిద్రలోనే వందలాది మంది మరణించారు. ఇంకా రెండు గ్రామాలు శవాల దిబ్బగా మారి చూపరుల కంట తడి పెట్టిస్తోంది. అయితే వాయనాడ్‌లో ఇంతటి విధ్వంసకర సంఘటన జరగడానికి ప్రకృతి మాత్రమే కదా.. మనవ తప్పిదం కూడా ఉందా.. అది కూడా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కారణమా..! అంటే అవును అంటున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వాయనాడ్‌లో విధ్వంసకర కొండచరియలు విరిగిపడటానికి వారం రోజుల ముందు కేరళకు కేంద్రం హెచ్చరిక జారీ చేసిందని, అయితే కేంద్ర హెచ్చరికలను .. చెప్పిన విషయన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెంటనే తోసిపుచ్చారని హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్నారు.

“జులై 23న భారత ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరిక చేసింది. తర్వాత జూలై 24, 25 తేదీల్లో ముందస్తు హెచ్చరికలు ఇచ్చారని.. జూలై 26న, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే అవకాశాల ఉంది కనుక తగు జాగ్రత్తలు.. ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కేరళ ప్రభుత్వానికి హెచ్చరించింది అని రాజ్యసభలో విపత్తుపై చర్చ సందర్భంగా షా చెప్పారు. అంతేకాదు జూలై 23వ తేదీన తొమ్మిది ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపామని, మంగళవారం మరో మూడు బెటాలియన్‌లను పంపించామని షా చెప్పారు. బాధిత ప్రజలను రక్షించేందుకు, పునరావాసం కల్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

కేరళ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలను ఎందుకు తరలించలేదు?” అని ప్రశ్నించిన హోం మంత్రి

ఇవి కూడా చదవండి

విపత్తు రాకముందే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం.. తుఫానుల విషయంపై కేంద్ర ఇచ్చిన హెచ్చరికలపై వేగంగా స్పందించే గుజరాత్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.

2014 నుండి ముందస్తు హెచ్చరిక వ్యవస్థల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,323 కోట్లు ఖర్చు చేసిందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఏడు రోజుల ముందుగానే విపత్తులను అంచనా వేయగల సామర్థ్యం ఉన్న మొదటి నాలుగు-ఐదు దేశాలలో భారతదేశం ఒకటి అని ఆయన అన్నారు.

కేంద్ర పదేపదే హెచ్చరికలపై కేరళ సిఎం విజయన్ ప్రవర్తన గురించి హోం మంత్రి షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విజయన్ కేంద్ర ఇచ్చిన హెచ్చరికలను సాధారణ వాతావరణ హెచ్చరికలు మాత్రమేనని భావించారు. అయితే కేంద్ర హెచ్చరిక జారీ చేసిన ప్రదేశానికి కనీసం 7 కిలోమీటర్ల దూరంలో కొండచరియలు విరిగి పడిన సెంటర్ పాయింట్ ఉందని చెప్పారు.

ముండక్కై, చూరల్‌మలలో కొండచరియలు విరిగిపడిన రోజున కూడా IMD ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందని సిఎం అంటున్నారు. కొండచరియలు విరిగిపడటానికి ముందు ఒక్కసారి కూడా ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేయలేదని ఐఎండీ ఉదయం 6 గంటలకు మాత్రమే రెడ్ అలర్ట్ జారీ చేసింది.. అది కూడా కొండచరియలు విరిగిపడిన తర్వాత, ”అని చెప్పారు. అయితే తానూ ఎవరినీ నిందించడానికి ప్రయత్నించడం లేదు. బ్లేమ్ గేమ్‌లో పాల్గొనడానికి ఇది సమయం కూడా కాదు. అయితే అలర్ట్ చేసిన తర్వాత కూడా కేరళ ఏం చేసిందని హోంమంత్రి ప్రశ్నించారు.

అయితే హోమ్ మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై సిఎం విజయన్ స్పందిస్తూ వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాద హెచ్చరిక వ్యవస్థను నిర్వహిస్తున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) లేదా వరద హెచ్చరికలు జారీ చేసే సెంట్రల్ వాటర్ కమీషన్, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని అధికారులకు ఎటువంటి అలెర్ట్ జారీ చేయలేదని చెప్పారు. జూలై 23 నుంచి 28 వరకు సీడబ్ల్యూసీ ఈ ప్రాంతంలో వరద హెచ్చరికలు చేయలేదని విజయన్ తెలిపారు.

కొండచరియలు విరిగిపడక ముందే భారత వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందని, ఈ ప్రాంతంలో 500 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అంచనాలను మించిపోయిందని సిఎం విజయన్ చెప్పారు.

జూలై 29 రోజున GSI కొన్ని సూచనలు చేసింది. వాయాండ్‌ను గ్రీన్ జోన్‌లో ఉంచి ఇక్కడ కొండచరియలు విరిగిపడే అవకాశం తక్కువ అని పేర్కొంది. మనంతవాడి, వైత్తిరి, సుల్తాన్ బతేరి తాలూకాలలో “కొన్ని చిన్నపాటి కొండచరియలు విరిగిపడవచ్చు” అని పేర్కొంది. అయితే కలపేట సమీపంలోని మెప్పాడికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఎల్లో, అరేంజ్, రెడ్ ఎలర్ట్ లతో పోలిస్తే గ్రీన్ జోన్ అత్యంత సురక్షితమైనది.

జూలై 29న వాయనాడ్‌ కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ చేసింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హెచ్చరికల ఆధారంగా ఇప్పటికే అదనపు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రాష్ట్రంలో మోహరించినట్లు హోం మంత్రి అమిత్ షా చేసిన వాదనను విజయన్ ఖండించారు. “వర్షం మొదలవడానికి ముందే వర్షాకాలంలో సాధారణంగా మొహరించే విధంగా తొమ్మిది ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. సాధారణ ఆపరేషన్‌లో భాగంగా ఒక బృందం వాయనాడ్‌లో ఉంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం వేగవంతంగా చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..