AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird flu: మళ్లీ కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8 వేలకు పైగా కోళ్లు, బాతుల సహా పెంపుడు పక్షులను చంపాలని కలెక్టర్ ఆదేశం

బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు చేపట్టారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఒక కిలోమీటరు పరిధిలోని 8 వేలకు పైగా పెంపుడు పక్షులను చంపాలని.. అనంతరం ఆ ప్రాంతంలో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

Bird flu: మళ్లీ కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8 వేలకు పైగా కోళ్లు, బాతుల సహా పెంపుడు పక్షులను చంపాలని కలెక్టర్ ఆదేశం
Bird Flu Outbreak In Kerala
Surya Kala
|

Updated on: Dec 14, 2022 | 6:26 PM

Share

Bird flu: మానవాళి మీద వైరస్ లు పగబట్టినట్లు ఉన్నాయి.. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ సృష్టించిన విలయం నుంచి బయటపడుతూ.. దాని తాలూకా చేదు జ్ఞాపకాలను మర్చిపోయే దిశగా అడుగులు వేస్తున్న వేళ మళ్ళీ దేశంలో బర్ద్ ఫ్లూ నేను ఉన్నానంటూ వెలుగులోకి వచ్చింది. అవును రకరకాల కొత్త వైరస్ లు కొత్త వ్యాధులు పుట్టుకొస్తూ.. మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా  ప్రకృతికి అందాల నిలయం కేరళలో మళ్ళీ బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది.

కొట్టాయం జిల్లాలోని అర్పూక్కర, తల యాజమ్ పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పీకే జయశ్రీ తెలిపారు.  వెంటనే బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు చేపట్టారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఒక కిలోమీటరు పరిధిలోని 8 వేలకు పైగా పెంపుడు పక్షులను చంపాలని.. అనంతరం ఆ ప్రాంతంలో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

బుధవారం నుంచి మూడు రోజుల పాటు బర్డ్ ఫ్లూ వ్యాధి కేంద్రంగా ఉన్న పది కిలోమీటర్ల పరిధిలో కోళ్లు, బాతులు,పక్షులు, ఇతర పెంపుడు పక్షుల, కోడి, బాతు గుడ్లు, మాంసం సహా సేంద్రీయ ఎరువుల క్రయ విక్రయాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  ఈ ప్రాంతంలోని పెంపుడు పక్షులు అసాధారణ రీతిలో మరణిస్తే.. వెంటనే అధికారులకు లేదా సమీపంలోని పాలక వర్గానికి తెలియజేయాలని కలెక్టర్ ఆ ప్రాంత ప్రజలను కోరారు.

ఇవి కూడా చదవండి

కొట్టాయం, వైకోమ్, ఎట్టుమనూర్ మున్సిపాలిటీల స్థానిక స్వపరిపాలన సంస్థలు.. వేచూర్, కురుప్పంతర, తలయాజ్జం, తలయోలపరంబు, కల్లార, నందూర్, టీవీ పురం, కడుతురుత్తి, ఉదయనపురం, కుమరకొం, అర్పుక్కర, ఐమానం, అతిరంపూజ, తిరువార్పు పంచాయతీలు 10 కిలోమీటర్ల మేర నిఘా జోన్‌ పరిధిలోకి వస్తాయి.

కొట్టాయంలో పక్షుల్లో వ్యాపించే  H5N1 వేరియంట్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ ఫ్లూ సాధారణంగా వలస పక్షులు లేదా సముద్ర పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ మనుషులపై ప్రభావం చూపనప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బాతు ఫారంలో అనేక బాతులు మరణించాయి. అంతేకాదు అర్పూకర, తలయాజంలో బ్రాయిలర్ కోళ్ల ఫారమ్‌లో కూడా ఇటీవల అనేక కోళ్లు చనిపోవడంతో అనుమానంతో వాటి నమూనాలను సేకరించి పరీక్షించారు. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌లోని ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా.. బర్డ్ ఫ్లూ సోకి బాతులు, కోళ్లు చనిపోయినట్లు ఈ పరీక్షల్లో నిర్ధారణ అయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..