Online Food Orders: పిల్లలకు బయటి ఫుడ్ పెట్టడంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

|

Sep 13, 2023 | 12:37 PM

రోజురోజుకి సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఓవైపు టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నా మరోవైపు మనుషుల్లో బద్దకం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ ద్వారా ఫుడ్ డెలివరి చేసే యాప్‌ల వచ్చాక చాలామంది ఆహార అలవాట్లలో మార్పులు వచ్చేశాయి. కొంతమందైతే వండుకోవడమే మానేశారు. కూర్చున్న సీట్‌లోనే మొబైల్ ఓపెన్ చేస్తే.. అందులో స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్లు చేసేస్తున్నారు. ఈ టెక్నాలజీ రాకముందు బయట ఫుడ్ తినాలంటే కచ్చితంగా బయటికి వెళ్లాల్సి వచ్చేది. మరికొందరు బయటకు ఏం వెళ్తాంలే ఇక్కడే తిందామంటూ ఇంట్లోనే వండుకోని తినేవారు.

Online Food Orders: పిల్లలకు బయటి ఫుడ్ పెట్టడంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Zomato
Follow us on

రోజురోజుకి సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఓవైపు టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నా మరోవైపు మనుషుల్లో బద్దకం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ ద్వారా ఫుడ్ డెలివరి చేసే యాప్‌ల వచ్చాక చాలామంది ఆహార అలవాట్లలో మార్పులు వచ్చేశాయి. కొంతమందైతే వండుకోవడమే మానేశారు. కూర్చున్న సీట్‌లోనే మొబైల్ ఓపెన్ చేస్తే.. అందులో స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్లు చేసేస్తున్నారు. ఈ టెక్నాలజీ రాకముందు బయట ఫుడ్ తినాలంటే కచ్చితంగా బయటికి వెళ్లాల్సి వచ్చేది. మరికొందరు బయటకు ఏం వెళ్తాంలే ఇక్కడే తిందామంటూ ఇంట్లోనే వండుకోని తినేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ యాప్‌లు రావడంతో గరిట పట్టుకోవడాన్ని తగ్గిస్తున్నారు. ఇంట్లో ఉండే పెద్దలే కాదు.. చివరికి వారి పిల్లలకు కూడా బయట నుంచి తెప్పించిన ఫుడ్‌నే పెడుతున్నారు. అయితే బయటి ఫుడ్ తినడంపై తాజాగా కేరళ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇంట్లోని పెద్దలు తమ పెద్దలు తమ పిల్లలకు ఇంట్లోనే వండి పెట్టాలని సూచనలు చేసింది. స్విగ్గీ, జోమాటో లాంటి వాటి నుంచి ఆర్డర్ చేసే బదులుగా.. తల్లి వండిన రుచికరమైన ఆహారాన్ని పిల్లలకు తినిపించాలని తెలిపింది. అలాగే పిల్లలకు స్వేచ్ఛను కూడా ఇవ్వాలంటూ వ్యాఖ్యానించింది. ఖాళీ సమయంలో క్రికెట్, ఫుట్‌బాల్.. లేదా వారు ఇష్టపడే క్రీడలను ఆడనివ్వండి అని కోరింది. అలాగే వారు ఇంటికి వచ్చినప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే ఫుడ్‌కు బదులుగా తల్లి వండిన ఆహాన్ని పెట్టండని పేర్కొంది.
అంతేకాదు భావితరాలదే భవిష్యత్ అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తింటేనే బాగుంటుందని చెప్పింది. ఇక యువతరాన్ని ఆరోగ్యవంతగా ఉంచాలా లేదా అన్న అంశాన్ని తల్లిదండ్రల విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పింది. ఇప్పుడు కేరళ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.

ఇదిలా ఉండగా మరోవైపు కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. బయటి ఫుడ్ ఎంతవరకు మంచిదో తెలియదని చెబుతున్నారు. బయటి ఫుడ్‌లో నకిలీ అల్లం, కలుషిత పదార్థాలతో వంటలు చేస్తున్న సంఘటనలు జరగడం చూస్తూనే ఉన్నామని అంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కల్తీ వెల్లుల్లీ పేస్టు , కల్తీ నూనె ఇలా ప్రతి ఒక్కటి కల్తీ అవుతున్నాయి. దీనివల్ల కొన్ని రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తక్కువ ధరలకు కల్తీ పదార్థాలను కొనగోలు చేసి వంటలు చేస్తున్న పరిస్థతి నెలరొంది.పెద్దలు తింటే పర్వాలేదు . కానీ పిల్లలు కూడా ఎక్కువగా బయటి ఫుడ్‌కే అలవాటు పడుతున్నారు. అందుకే కేరళ హైకోర్టు ఈ అంశాన్ని తీసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా పిల్లలకు బయటి ఫుడ్ కాకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని తినిపించడం మంచిదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..