Kerala HC: దేవాలయ ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖ ఏర్పాటు హైకోర్టు నిషేధం.. బృంధంగా ఆయుధ శిక్షణ, యోగా కార్యక్రమ నిర్వహణపై అనుమతి నిరాకరణ..

|

Sep 12, 2023 | 1:51 PM

ఆలయ ప్రాంగణంలో ఆయుధ శిక్షణ ఇప్పటికే నిషేధించగా.. తాజాగా ఆర్ఎస్ఎస్ బ్రాంచ్ ఏర్పాటుపై కూడా నిషేధం విధించింది హైకోర్టు. ఆలయ ప్రాంగణాన్ని మాస్ డ్రిల్ లేదా ఆయుధ శిక్షణ కోసం ఉపయోగించరాదని కోర్టు తెలిపింది. పూజ, పండుగ సందర్భంలో చేసే కార్యక్రమాలకు మినహా మరే ఇతర కార్యక్రమాలకు అనుమతి ఉండదని పేర్కొంది.  సర్కార దేవి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) చేతిలో ఉందని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. 

Kerala HC: దేవాలయ ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖ ఏర్పాటు హైకోర్టు నిషేధం.. బృంధంగా ఆయుధ శిక్షణ, యోగా కార్యక్రమ నిర్వహణపై అనుమతి నిరాకరణ..
Hc Bans Rss Training
Follow us on

కేరళ రాజధాని తిరువనంతపురంలోని సర్కార దేవి ఆలయ ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖ ఏర్పాటుపై కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆలయ సముదాయంలో అసలు ఆర్ఎస్ఎస్ శాఖను అనుమతించమని స్పష్టం చేసింది. సర్కార్ దేవి ఆలయంలో ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సర్కార దేవి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) చేతిలో ఉందని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది.

ఆలయ ప్రాంగణంలో బృందాలు చేసే వ్యాయామాలు లేదా ఆయుధ శిక్షణకు అనుమతించమని కోర్టు తెలిపింది. ఆలయ ప్రాంగణంలో ఆయుధ శిక్షణ ఇప్పటికే నిషేధించగా.. తాజాగా ఆర్ఎస్ఎస్ బ్రాంచ్ ఏర్పాటుపై కూడా నిషేధం విధించింది హైకోర్టు. ఆలయ ప్రాంగణాన్ని మాస్ డ్రిల్ లేదా ఆయుధ శిక్షణ కోసం ఉపయోగించరాదని కోర్టు తెలిపింది. పూజ, పండుగ సందర్భంలో చేసే కార్యక్రమాలకు మినహా మరే ఇతర కార్యక్రమాలకు అనుమతి ఉండదని పేర్కొంది.

ఆలయ ప్రాంగణంలో మాస్ డ్రిల్ – ఆయుధ శిక్షణకు అనుమతి లేదు – కోర్టు

ఆలయ ప్రాంగణంలో పూజలు, పండుగలకు మినహా మరే ఇతర కార్యక్రమాలను అనుమతించబోమని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల జస్టిస్ అనిల్ కె నరేంద్రన్, జస్టిస్ పిజి అజిత్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో కూడా, ఆలయ ప్రాంగణంలో ఆయుధాలు.. బృందంగా ఏర్పడి చేసే వ్యాయామం లేదా అభ్యాసంపై నిషేధం విధించినట్లు  ధర్మాసనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

అధికారులు ఆదేశాలను కచ్చితంగా పాటించాలి- టీడీబీ

గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా టీడీబీకి అవసరమైన సహాయం అందించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. మే 18న టీడీబీ కొత్త సర్క్యులర్‌ జారీ చేసింది. ఇందులో ముందున్న ఆదేశాలను కచ్చితంగా పాటించాలని తన అధికారులను కోరారు. ఈ క్రమంలోనే బోర్డు పరిధిలోని అన్ని దేవాలయాల్లో శాఖలు లేదా ఆర్‌ఎస్‌ఎస్ గ్రూప్ ప్రాక్టీస్‌పై నిషేధం ఉంది.

టీడీబీ 2016లో తొలిసారిగా సర్క్యులర్‌ జారీ 

ఆర్‌ఎస్‌ఎస్ సామూహిక వ్యాయామాలు, ఆయుధ శిక్షణలను నిషేధించాలని 2016లోనే టీడీబీ సర్క్యులర్ జారీ చేసిందని.. కేరళలోని ఆలయాలను ఆయుధ దుకాణాలుగా మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందని అప్పటి దేవస్వామ్ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ పేర్కొన్నారు. అనంతరం మళ్లీ బోర్డు 30 మార్చి 2021న సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సందర్భంగా సురేంద్రన్ ఆర్‌ఎస్‌ఎస్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..