అనంత పద్మనాభుడికే కాదు.. గురువాయూర్‌ ఆలయ ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే

|

Dec 30, 2022 | 1:34 PM

దేశంలో ఏ ఆలయానికి అత్యధిక ఆస్తులు ఉన్నాయన్న చర్చకు వస్తే వెంటనే గుర్తొచ్చేది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం.. అలాగే ఎన్నో ఆలయాలు అధిక ఆదాయాలను కలిగి ఉన్నాయి. తాజాగా కేరళలోని మరో ఆలయ ఆస్తుల విలువ అందరినీ..

అనంత పద్మనాభుడికే కాదు.. గురువాయూర్‌ ఆలయ ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే
Guruvayur Temple, Kerala
Follow us on

దేశంలో ఏ ఆలయానికి అత్యధిక ఆస్తులు ఉన్నాయన్న చర్చకు వస్తే వెంటనే గుర్తొచ్చేది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం.. అలాగే ఎన్నో ఆలయాలు అధిక ఆదాయాలను కలిగి ఉన్నాయి. తాజాగా కేరళలోని మరో ఆలయ ఆస్తుల విలువ అందరినీ ఆకర్షిస్తోంది. వివిధ ఆలయాలకు భక్తులు ఇచ్చిన ఆస్తుల విలువ చాలా దేవాలయాలకు అధికంగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయం ఏమిటంటే చాలా మంది వెంటనే చెప్పేది తిరుమల వెంకన్న. ఇదే సమయంలో అధిక ఆస్తులు గల చిన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఇదే జాబితాలో కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని ప్రముఖ గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయానికి సైతం వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఆర్టీఐ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయానికి వివిధ బ్యాంకుల్లో రూ.1,737 కోట్ల నగదు డిపాజిట్లు, 271 ఎకరాల భూములు ఉన్నట్లు ఎం.కె.హరిదాస్‌ అనే భక్తుడు దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు అధికారులు సమాధానం ఇచ్చారు.

భద్రతా కారణాల రీత్యా స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు, బంగారం, వెండి తదితర ఆభరణాల వివరాలు, భూముల విలువను అధికారులు వెల్లడించలేదు. శతాబ్దాల చరిత్ర కలిగిన గురువాయూర్‌లో శ్రీమహావిష్ణువు.. శ్రీకృష్ణుడిగా పూజలు అందుకుంటున్నారు. దేశం నలు మూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి భారీగా తరలివస్తుంటారు. ఆర్టీఐ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆలయానికి 271.0506 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విలువను మాత్రం వెల్లడించలేదు. వివిధ బ్యాంకుల్లో రూ.17,37,04,90,961 నగదు ఉంది. అయితే, పినరయి విజయన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 నుంచి కేరళ ప్రభుత్వం నుంచి ఆలయానికి ఆర్థిక సాయం అందడం లేదని పేర్కొంది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ 2018-19 వరదల తరువాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన 10 కోట్ల రూపాయలను దేవస్థానం ఇంకా స్వీకరించలేదని స్పష్టం చేసింది.

మరోవైపు ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేమం విషయంలో దేవస్థానం నిరంతరం నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల ఈ వివరాలను ఆర్టీఐ ద్వారా కోరాల్సి వచ్చిందని హరిదాస్ తెలిపారు. దేవాలయంలో భారీ బ్యాంకు డిపాజిట్లు, ఇతర ఆస్తులు ఉన్నాయని, ఇప్పటికీ గురువాయూర్ ఆలయ అభివృద్ధికి, భక్తులకు ప్రభుత్వం ఏమి చేయడం లేదని హరిదాస్ పేర్కొన్నారు. ఆలయం సమీపంలో యాజమాన్యం ఆసుపత్రిని నడుపుతోందని, కానీ దాని పరిస్థితి, నిర్వహణ దయనీయంగా ఉందని ఆరోపించారు. ప్రసాదం పంపిణీ విషయంలో దేవస్థానంపై హరిదాస్ విమర్శలు చేశారు. రోజువారీ కైంకర్యాలు, నివేదనలకు అవసరమైన పూల కోసం తోటను పెంచడానికి కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..