Delhi Metro: అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఢిల్లీ మెట్రో స్టేషన్… ఏకంగా 47 ఎస్కలేటర్లతో..

Kashmere Gate Metro station Set New Record: ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సేవలు అందించే క్రమంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్‌సీ) మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే కొత్తగా మరో...

Delhi Metro: అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఢిల్లీ మెట్రో స్టేషన్... ఏకంగా 47 ఎస్కలేటర్లతో..

Updated on: Feb 12, 2021 | 5:29 PM

Kashmere Gate Metro station Set New Record: ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సేవలు అందించే క్రమంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్‌సీ) మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే కొత్తగా మరో పది ఎస్కలేటర్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఢిల్లీ మెట్రోలే ముఖ్యమైన స్టేషన్ అయిన.. కశ్మీరీ గేట్‌లో రెండు ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ స్టేషన్‌లో ఎస్కలేటర్ల సంఖ్య ఏకంగా 47కు పెరిగింది. కేవలం ఒకే స్టేషన్‌లో ఇన్ని ఎస్కలేటర్లతో ఈ మెట్రో స్టేషన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.


వీటితో పాటు మిగిలిన 8 ఎస్కలేటర్లను నగరంలోని పలు స్టేషన్‌లలో ఏర్పాటు చేసినట్లు.. మెట్రో అధికారులు తెలిపారు. ఢిల్లీలో మెట్రోలో ఉన్న ఏకైక ట్రిపుల్ ఇంటర్ ఛేంజ్ మెట్రో ష్టేషన్ కశ్మీరీ గేట్ స్టేషన్. ఈ స్టేషన్ లైన్1, లైన్2, లైన్6ల మధ్య ఇంటర్ ఛేజింగ్‌లా ఉపయోగపడుతుంది. మూడు రూట్లకు వెళ్లే రైళ్లు రావడంతో ఇక్కడ ప్రయాణీకుల రద్దీ తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగానే ఇక్కడ అంత పెద్ద ఎత్తున ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. 47 ఎస్కలేటర్లతో కశ్మీరీ గేట్ స్టేషన్ భారతదేశంలోనే అత్యధిక ఎస్కలేటర్లు ఉన్న మెట్రో స్టేషన్‌గా పేరుగాంచింది. అంతేకాకుండా 14.5 మీటర్ల పొడవుతో అత్యంత పొడవైన ఎస్కలేటర్ ఉంది కూడా ఈ స్టేషన్‌లోనే అని మెట్రో అధికారులు తెలిపారు.

Also Read: NEST 2021: నెస్ట్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ఎప్పటినుంచి ప్రారంభమవుతుందంటే..?