Mobile Ban in Temples: కర్ణాటక దేవాలయ ప్రాంగణంలో ఫోన్ నిషేధం..? దీనిపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

టాయిలెట్స్‌లోకి కూడా ఫోన్ లేకపోతే వెళ్లలేని పరిస్థితి. అలాంటిది దేవాలయాలలోకి తీసుకెళ్లడం ఒక లెక్కా..? అయితే దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లపై.. నిషేధం..

Mobile Ban in Temples: కర్ణాటక దేవాలయ ప్రాంగణంలో ఫోన్ నిషేధం..? దీనిపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..
Ban On Mobiles In Temples
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 17, 2022 | 9:49 PM

ప్రస్తుతం టెక్నాలజీ మానవుని జీవితాన్ని దాదాపుగా ఆక్రమించేసింది. ముఖ్యంగా సెల్ ఫోన్‌లు లేనిదే మనిషి నిద్రలేవడం లేదు.. అలాగే నిద్రపోవడం లేదు. ఆఖరికి టాయిలెట్స్‌లోకి కూడా ఫోన్ లేకపోతే వెళ్లలేని పరిస్థితి. అలాంటిది దేవాలయాలలోకి తీసుకెళ్లడం ఒక లెక్కా..? అయితే దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించినట్లే కర్ణాటకలోని ఆలయాల్లోనూ మొబైల్ ఫోన్లను నిషేధించాలన్న నినాదాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం పైనే కర్ణాటక అర్చకులు ఈరోజు(డిసెంబర్ 17) కేంద్ర మంత్రి శశికళ జోలెను కలిసి ముజరై పరిధిలోని ఆలయాల్లో మొబైల్ బ్యాన్ చేయాలని కోరారు.

బెంగళూరులోని ముజరాయి శాఖ కార్యాలయంలో మంత్రి శశికళ జోలెను కర్ణాటక అర్చక సమాఖ్య కలసి ఆలయ ప్రాంగణంలో సెల్ఫీలు దిగడం, దేవుడి ఆభరణాలను ఫొటోలు తీయడం, ఆడపిల్లలు ఫొటోలు దిగడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. కొందరు చేసే పనుల వల్ల ఇతర భక్తుల ఏకాగ్రత కూడా దెబ్బతింటున్నందున ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించాలని కేంద్ర మంత్రిని కర్ణాటక ఆర్చకులు సమాఖ్య కోరింది. ఈ విషయంపై అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని అర్చకుల సమాఖ్యకు మంత్రి జొల్లె హామీ ఇచ్చారు.

కాగా తమిళనాడులోని ఆలయాల పవిత్రతను, స్వచ్ఛతను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని మద్రాసు హైకోర్టు ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు ఆర్.మహదేవన్, జస్టిస్ జె.సత్యనారాయణ ప్రసాదలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎం. సీతారామన్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను పరిష్కరిస్తూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి

తమిళనాడులోని ఆరు ప్రధాన మురుగ దేవాలయాల్లో, తూత్తుకుడి తిరుచెందూర్‌లోని అరుల్మిగు సుబ్రమణి స్వామి ఆలయ ప్రాంగణంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లను తీసుకెళ్లడం, ఉపయోగించడం నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఎం. సీతారామన్ డిమాండ్ చేశారు. ఇదే తరహాలో కర్ణాటకలో కూడా ఇప్పుడు అదే డిమాండ్ పెరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి