Accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం..

మృతులు ధర్మస్థలలోని శ్రీ మంజునాథ ఆలయం, సుబ్రమణ్య, హాసనాంబ ఆలయాల దర్శనం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయాల దర్శనం అనంతరం.. 14 మంది యాత్రికులు

Accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం..
Road Accident

Updated on: Oct 16, 2022 | 4:09 PM

కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో వాహనం, పాల వ్యాన్‌ ఢీ కొన్న ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన హసన్‌ జిల్లాలోని ఆర్సికేరే సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మృతులు ధర్మస్థలలోని శ్రీ మంజునాథ ఆలయం, సుబ్రమణ్య, హాసనాంబ ఆలయాల దర్శనం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయాల దర్శనం అనంతరం.. 14 మంది యాత్రికులు స్వగ్రామానికి తిరుగు పయణమయ్యారు.

ఈ క్రమంలో ఆర్సికేరే వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం.. కేఎంఎఫ్ పాల వ్యాన్‌ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారని.. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని హసన్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హసన్‌ పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మృతులను కందమ్మ దృవ(2), తన్మయ్(10), లీలావతి(50), చైత్ర(33), సమర్థ్(10), డింపీ(12), వందన(20), దొడ్డయ్య(60), భారతి(50)గా గుర్తించారు. ఇద్దరు పిల్లలు కందమ్మ దృవ, తన్మయి దొడ్డహళ్లికి చెందిన వారు కాగా, అందరూ సాలాపూర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..