పందెం పొట్టేలు చోరీ చేసి మటన్ మార్కెట్లో రెండున్నర లక్షలకు బేరం.. అంతలో ఊహించని ట్విస్ట్!

ఫైటర్ పొట్టేలును కొందరు ఓ యువకుడు చోరీ చేశాడు. అనంతరం దానిని మటన్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకునే యత్నం చేశారు. ఇంతలో రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాళ్ల బారీ నుంచి పొట్టేలును రక్షించి యజమానికి వద్దకు తరలించారు. ఈ షాకింగ్ ఘటన..

పందెం పొట్టేలు చోరీ చేసి మటన్ మార్కెట్లో రెండున్నర లక్షలకు బేరం.. అంతలో ఊహించని ట్విస్ట్!
Fighter Ram Rocky Tagaru
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 30, 2023 | 2:39 PM

బెళగావి, ఆగస్టు 30: ఫైటర్ పొట్టేలును కొందరు ఓ యువకుడు చోరీ చేశాడు. అనంతరం దానిని మటన్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకునే యత్నం చేశారు. ఇంతలో రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాళ్ల బారీ నుంచి పొట్టేలును రక్షించి యజమానికి వద్దకు తరలించారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెళగావి జిల్లా గోకాక్ తాలూకాలోని తలకటనాల గ్రామానికి చెందిన అజయ్ కనీల్దార్‌ అనే వ్యక్తి రాకీ టగరు అనే ఫైటర్‌ పొట్టేలు పెంచుకుంటున్నాడు. అక్కడి స్థానికులకు రాకీ టగరు అంటే మహా ఇష్టం.. ఎక్కడ పొట్టేలు పోటీలు జరిగినా రాకీ టగరు పొట్టేలు గెలిచేంది. దీంతో నిండా ఐదేళ్లు కూడా లేని రాకీ టగరు అక్కడ చాలా ఫేమస్ అయ్యింది. ఎక్కడున్న దానిని గుర్తించేవారు. ఇక అజయ్ కూడా పొట్టేలును కొనేందుకు ఎంతమంది వచ్చి అధిక ధర ఆశ చూపినా దానిని విక్రయించేందుకు నిరాకరించేవాడు. రాకీ టగరు పొట్టేలును తన సొంత కొడుకులా చూసుకుంటున్నానని, ఎవరికీ అమ్మబోనని తెగేసి చెప్పేవాడు. ఈ క్రమంలో ఖదీమ్‌ అనే వ్యక్తి శనివారం రాత్రి ఇంటి వద్ద కట్టేసి ఉన్న పొట్టేలును దొంగిలించాడు. దీంతో యజమాని అజయ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలించసాగారు.

ఇక దొంగిలించిన పొట్టేలు అకవకుండా నిందితుడు దానికి మూతికి తొడుగు తొడిగాడు. దొంగిలించిన పొట్టేలును స్థానికంగా ఉన్న ఓ మటన్ మార్కెట్‌కు అమ్మకానికి తీసుకువచ్చాడు. ఇంట్లో కట్టిన పొట్టేలును ఖదీం దొంగిలించి రెండున్నర లక్షలు డిమాండ్ చేయసాగాడు. ఆ పొట్టేలు ఎవరిదని తెలిసిన వ్యక్తి ఆరా తీయగా ఖదీం భయాందోళనకు గురై పొట్టేలును వదిలి పరారయ్యాడు. దీంతో రాకీ క్షేమంగా యజమాని ఇంటికి తిరిగొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..