మంత్రిగారి ఆస్తుల చిట్టా.. చదివింది 9వ తరగతి.. ఆస్తేమే రూ. 1,609 కోట్లు
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవంతరంగా జరగనున్నాయి. వచ్చే నెలలో జరగనున్న ఎలక్షన్లకు ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో కర్ణాటక రాజకీయాల్లోకి అత్యంత శ్రీమంతుడు అడుగుపెట్టనున్నారు..
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవంతరంగా జరగనున్నాయి. వచ్చే నెలలో జరగనున్న ఎలక్షన్లకు ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో కర్ణాటక రాజకీయాల్లోకి అత్యంత శ్రీమంతుడు అడుగుపెట్టనున్నారు. హొసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మంత్రి ఎంటీబీ నాగరాజు (72) సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. తొమ్మిదో తరగతి మాత్రమే చదువుకున్న మంత్రి ఎంటీబీ నాగరాజుకు రూ. 1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తన భార్య పేరిట రూ.536 కోట్ల చరాస్థులు, రూ.1,073 కోట్ల స్థిరాస్థులు ఉన్నట్లు తెలిపారు. నాగరాజు దంపతులకు రూ.98.36 కోట్ల రుణాలు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు.
దీంతో రాజకీయ నాయకుల్లో అత్యంత ధనవంతుడు ఎవరనే ప్రశ్న తలెత్తితే ఎంటీబీ నాగరాజు పేరు వినిపించనుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన నాగరాజుకు అప్పట్లో రూ.1,120 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు కూలిపోవడంతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలలో నాగరాజు కూడా ఉన్నారు. బీజేపీలో చేరి 2020 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత విధాన పరిషత్తుకు ఎన్నికై మంత్రి అయ్యారు. అనంతరం ఆయన ఆస్తులు మరో రూ.495 కోట్లమేర పెరిగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.