Minister KS Eshwarappa: కర్ణాటక పంచాయతీ శాఖ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. రేపు సీఎంకు లేఖ అందజేత!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక కాంట్రాక్టర్ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Minister KS Eshwarappa: కర్ణాటక పంచాయతీ శాఖ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. రేపు సీఎంకు లేఖ అందజేత!
Karnataka Minister Ks Eshwarappa
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 14, 2022 | 8:14 PM

Karnataka Minister KS Eshwarappa: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక కాంట్రాక్టర్ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య(Santosh Patil Suicide) వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప(KS Eshwarappa) తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం తన రాజీనామాను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Baswaraj Bommai)కి అందజేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ను కలిశారు. రాష్ట్ర మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసులో ఇంటా బయట విమర్శలు ఎక్కువడంతో మంత్రి ఈశ్వరప్ప రాజీనామాకు సిద్ధమయ్యారు.

ఇటీవల ‘40శాతం కమీషను’ ఇవ్వాలంటూ మంత్రి తనను వేధింపులకు గురిచేశారనీ.. తన ఆత్మహత్యకు ఆయనే కారణమని పేర్కొంటూ కాంట్రాక్టర్ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయన్ను అరెస్టు చేయాలంటూ విపక్షాలు, ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అప్పటి నుంచి బీజేపీపై నిరంతరం ఒత్తిడి పెరుగుతూనే ఉంది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు ప్రేరేపించారని కేఎస్ ఈశ్వరప్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నాయి. దీనికి సంబంధించి మంత్రి నుంచి సమాధానం కూడా కోరగా, మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయాల్సి ఉంటుందని ఇప్పటికే ఊహాగానాలు వచ్చాయి. అయితే నిన్నటి వరకు ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేయనని చెబుతూనే ఉన్నారు.

ఇదిలావుంటే, కాంట్రాక్టర్ సోదరుడు ప్రశాంత్ పాటిల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, ఈశ్వరప్ప, అతని సహచరులు కాంట్రాక్టర్ నుండి 40 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, ఈశ్వరప్ప సన్నిహితులు రూ. పర్సంటేజీ కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ సోమవారం రాత్రి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఉడిపి పోలీసులు ఈశ్వరప్పతో పాటు అతని సహచరులు బసవరాజ్, రమేష్ సహా ఇతరులపై కేసు నమోదు చేశారు.

Read Also…  BR Ambedkar Jayanti: తల్లిదండ్రులకు 14వ సంతానం అంబేద్కర్… ఫ్యామిలీ ముఖ్యమైన విశేషాలు మీకోసం

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!