Viral News: అంబేద్కర్ జయంతి కానుక.. రూపాయికే లీటరు పెట్రోల్.. బంకుల వద్ద బారులు తీరిన జనం
Viral News: దేశంలో రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Cost) ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడికి పెట్రోల్ కొనాలంటే.. పెనుభారంగా మారింది. తాజాగా దేశంలో..
Viral News: దేశంలో రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Cost) ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడికి పెట్రోల్ కొనాలంటే.. పెనుభారంగా మారింది. తాజాగా దేశంలో ప్రముఖ నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120 కి చేరువలో ఉన్నాయి. దీంతో వాహనదారులు సొంత వాహనాల్లో తిరగాలంటే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు ఒక స్వచ్చంద సంస్థ లీటరు పెట్రోల్ ను కేవలం ఒక్క రూపాయికే అందిస్తోంది. గురువారం దాదాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని షోలాపూర్‌లో అపూర్వమైన పథకాన్ని అమలు చేశారు. పెట్రోలు ధర ఆకాశాన్నంటుతున్న వేళ లీటర్ ఒక్క రూపాయికే పెట్రోల్ పంపిణీ చేశారు. డాక్టర్ షోలాపూర్. అంబేద్కర్ విద్యార్థులు, యూత్ పాంథర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. షోలాపూర్‌లో ఈరోజు పెట్రోల్ ధర రూ.120.18.
అవును మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలను విభిన్నంగా సెలబ్రేట్ చేశారు. జిల్లాలో అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాదు.. అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు . షోలాపూర్‌లోని డఫెరిన్ చౌక్ పెట్రోల్ బంక్ దగ్గర ద్వి చక్ర వాహనదారులకు రులకు రూ.1 కే లీటర్ పెట్రోల్ అందించారు. దీంతో ట్రోల్ బంక్ దగ్గర వాహనదారులు బారులు తీరారు. సుమారు 500 మంది వాహనదారులకు రూ. 1కే పెట్రోల్ పంపిణీ చేశారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పలువురికి తెలియడంతో.. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా పెట్రోల్ కోసం బంక్ వద్ద బారులు తీరారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Note: జాతీయ మీడియాల్లోని వార్తా కథనాల ఆధారంగా కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే ఈ ఆర్టికల్ ను ప్రచురించాము. ఇందులో పేర్కొన్న వివరాలకు టీవీ9 కు ఎలాంటి సంబంధం లేదు.
Also Read: Minister KS Eshwarappa: కర్ణాటక పంచాయతీ శాఖ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. రేపు సీఎంకు లేఖ అందజేత!