C Kunhambu No More: వెయ్యి సొరంగాలు తవ్వి .. ప్రజల నీటి ఎద్దడిని తీర్చిన వ్యక్తి ఆత్మహత్య..

|

Jan 21, 2023 | 7:33 PM

మంచి మనసుతో గొప్ప పేరుతో జీవించిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన సి. కున్హాంబు. 72 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతని ఆకస్మిక మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

C Kunhambu No More: వెయ్యి సొరంగాలు తవ్వి .. ప్రజల నీటి ఎద్దడిని తీర్చిన వ్యక్తి ఆత్మహత్య..
C Kunhambu No More
Follow us on

అతను తాను జీవించి ఉన్నంత కాలం పరులకు ఆలోచించాడు. ప్రజల నీటి ఎద్దడి తీర్చడంలో అతడిది అందెవేసిన చేయి. నీటిని భూమిలో నిలిపి ఉంచేలా చేయడంలో ఏ భూగర్భశాస్త్రవేత్తా అతని ముందు పనికిరాడు. అలా వెయ్యి సొరంగాలు తవ్వాడు. కానీ చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం తన ఇంట్లో శవమై కనిపించాడు. మంచి మనసుతో గొప్ప పేరుతో జీవించిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన సి. కున్హాంబు. 72 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతని ఆకస్మిక మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ఆత్మహత్యగా అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బెడడ్కలోని కుండంకుజికి చెందిన సి. కుంహంబు తాగునీటి కోసం లేటరైట్ కొండల మీద నుంచి సమాంతర సొరంగాలు నిర్మించడంలో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. దక్షిణ కర్ణాటకలో అలాగే కేరళలోని ఉత్తర కాసర రోడ్డు జిల్లాలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు అతను బాగా పరిచయం. భూగర్భ జలాలను పెంచడం కోసం నేలకు ఉన్న గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగిస్తూ ఆయన పనిచేసేవాడు. ఈ మేరకు సొరంగబావులు తవ్వేవాడు. చాలా మందికి తాగునీటి అవసరాలను తీర్చడంలో కున్హాంబుది అందవేసిన చేయి. ‘కున్హాంబు 14ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి సొరంగాలు తవ్వుతున్నాడు. శాస్త్రవేత్తల కంటే కున్హాంబుకు ఉన్న భౌగోళిక అవగాహన ఎంతో గొప్పగా ఉంటుంది’ అని జాగ్రఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి గోవిందన్ కుట్టి ఈ సందర్భంగా తెలిపారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు పిల్లలు దయామణి, వాసంతి, రతీష్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..