కేబినెట్ హోదా మంత్రి సౌకర్యాలు తిరస్కరించిన కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప.. ఎందుకంటే ..?

| Edited By: Phani CH

Aug 08, 2021 | 7:57 PM

కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప తనకు కేబినెట్ హోదా మంత్రి సౌకర్యాలు వద్దని సున్నితంగా తిరస్కరించారు. మీకు ఇదే హోదా, సదుపాయాలు..ఇదే వేతనం. ప్రభుత్వ వాహనం.

కేబినెట్ హోదా మంత్రి సౌకర్యాలు తిరస్కరించిన కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప.. ఎందుకంటే ..?
Karnataka Ex Cm Yediyurappa
Follow us on

కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప తనకు కేబినెట్ హోదా మంత్రి సౌకర్యాలు వద్దని సున్నితంగా తిరస్కరించారు. మీకు ఇదే హోదా, సదుపాయాలు..ఇదే వేతనం. ప్రభుత్వ వాహనం. అధికారిక నివాసం వంటి ప్రయోజనాలు ఉంటాయని రాష్ట్ర పర్సనల్, అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ విభాగం నిన్న ఆయనను ఉద్దేశించి ఓ ఉత్తర్వును జారీ చేసింది. సీఎం బసవరాజ్ బొమ్మై అధికారంలో ఉన్నంత కాలం ఈ సౌకర్యాలు ఉంటాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ ఉత్తర్వును ఉపసంహరించాలని, మాజీ ముఖ్యమంత్రికి ఏ సదుపాయాలు ఉంటాయో అవి తనకు చాలునని యెడియూరప్ప ..ఆదివారం బొమ్మైకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం యెడియూరప్పకు అధికారికంగా ఏ హోదా లేదు.. శకరపుర నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాత్రం ఆయన కొనసాగుతున్నారు.గత నెల 26 న ఈయన రాజీనామా చేయగా.. రెండు రోజులకే 28 న బసవరాజ్ బొమ్మై సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. యెడియూరప్ప మాదిరే ఈయన కూడా శక్తిమంతమైన లింగాయత్ వర్గానికి చెందినవారు.

ఇలా ఉండగా నాలుగు రోజుల క్రితమే 29 మంది మంత్రులతో బొమ్మై తన కేబినెట్ ను ఏర్పాటు చేశారు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కని పలువురు సీనియర్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పుడే తమ నిరసనను వ్యక్తం చేశారు. యెడియూరప్ప మంత్రివర్గంలో ఉన్న పలువురు బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అనుభవజ్ఞులైన వారిని పక్కన బెట్టి ఏ మాత్రం అనుభవం లేని కొత్తవారిని ఆయన మంత్రివర్గంలో తీసుకున్నారని వారు పెదవి విరిచారు. కానీ అందరినీ కేబినెట్ లోకి తీసుకోవడం సాధ్యం కాదని బొమ్మై స్పష్టం చేశారు. సమయం వచ్చినపుడు వీరి కోర్కెను పరిశీలిస్తానని ఆయన చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: PM-Kisan: సోమవారమే రైతుల ఖాతాల్లోకి ప్రధాన మంత్రి కిసాన్ నిధులు.. చెక్ చేసుకోవడం ఇలా.. 

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ తలకు గాయమైందా..? అభిమాని ప్రశ్నకు స్పందించిన చిత్ర యూనిట్‌.