Karnataka election: కర్నాటకలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం.. రాహుల్‌ సుడిగాలి ప్రచారం

కర్నాటకలో ఎన్నికల ప్రచారం స్పీడందుకుంది. కాంగ్రెస్‌ తరపున రాహుల్‌గాంధీ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టాలని , రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని రాహుల్ డిమాండ్‌ చేశారు.

Karnataka election: కర్నాటకలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం.. రాహుల్‌ సుడిగాలి ప్రచారం
Rahul
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 23, 2023 | 10:02 PM

కర్నాటకలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. హేమీహేమీలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రాహుల్‌గాంధీ కూడా పలు సభల్లో పాల్గొంటున్నారు. లింగాయత్‌లకు ఆరాధ్యదైవమైన బసవేశ్వరుడి జయంతి వేడుకలకు హాజరయ్యారు రాహుల్‌. రెండు రోజుల పాటు కర్నాటకలో రాహుల్‌ ప్రచారం కొనసాగుతుంది. హుబ్లీ , బాగల్‌కోటే ప్రాంతాల్లో పర్యటించారు రాహుల్‌. బసవేశ్వరుడి బోధనలు అందరికి ఆదర్శమన్నారు . భయపడకుండా నిజాన్ని మాట్లాడడం బసవేశ్వరుడి అందరికి బోధించారని అన్నారు రాహుల్‌. బాగల్‌కోటేలో కుడల సంగమ ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి సిద్దరామయ్యతో పాటు ఇతర కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు.

విజయపురలో రాహుల్‌గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. రాహుల్‌ రోడ్‌షోకు జనం పోటెత్తారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. దేశంలో వెంటనే బీసీ జనగణన చేపట్టాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని కోరారు.

ఓబీసీలకు దేశసంపదను పంచడం మీకు ఇష్టం లేదు. మీకు చిత్తశుద్ది ఉంటే జనాభా లెక్కలు వెల్లడించాలి. మీకు లెక్కలు విడుదల చేయకపోతే మేమే విడుదల చేస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలి. బీజేపీ కూడా కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బెంగళూర్‌లో రోడ్‌షో నిర్వహించారు సీఎం బస్వరాజ్‌ బొమ్మై. కర్నాటకలో మరోసారి బీజేపీదే అధికారమన్నారు. విదానసౌధలో జరిగిన బసవేశ్వరుడి జయంతి వేడుకలకు బొమ్మై హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం