Mudhol Dogs: ప్రధాని మోడీ భద్రతా దళంలో ముధోల్‌ శునకాలు.. వీటి ప్రత్యేక ఏమిటో తెలిస్తే షాకవుతారు..!

|

Aug 19, 2022 | 5:44 PM

Mudhol Dogs: పోలీసు విభాగంలో కుక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. కేసులను చేధించడంలో కుక్కలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇక దేశ ప్రధాని..

Mudhol Dogs: ప్రధాని మోడీ భద్రతా దళంలో ముధోల్‌ శునకాలు.. వీటి ప్రత్యేక ఏమిటో తెలిస్తే షాకవుతారు..!
Mudhol Dogs
Follow us on

Mudhol Dogs: పోలీసు విభాగంలో కుక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. కేసులను చేధించడంలో కుక్కలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా దళంలో ఇప్పుడు తొలిసారిగా దేశవాళీ జాతి కుక్క ముదోల్‌కు చెందిన ప్రత్యేక శునకాలను ఉపయోగిస్తున్నారు. సన్నగా, పొడుగ్గా ఉండే ఈ కక్కును ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా విభాగంలో చేర్చారు. ముధోల్ హౌండ్ జాతి కుక్కలు చాలా తెలివైనవి. అవి ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, అనేక భద్రతా దళాలలో పని చేస్తున్నాయి. కానీ ఇప్పుడు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (SPG) ఈ శునకాలను PM భద్రత కోసం తన స్క్వాడ్‌లో చేర్చుకుంది. ప్రధాని మోదీ కూడా మన్ కీ బాత్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లా ముధోల్‌ ప్రాంతానికి చెందిన ఈ శునకాల ప్రత్యేకతే వేరు. ఎంతో శక్తి సామర్థ్యాలు ఈ శునకాల్లో ఉంటాయి. దేశ సరిహద్దులలో పహరా, నేరస్తులను సునాయాసంగా పట్టుకోవడంలో ఈ శునకాల ప్రత్యేకత.

కర్ణాటకలో బాగల్‌కోట జిల్లా ముధోల్‌ ప్రాంతానికి చెందిన శునకాల ప్రత్యేకత, శక్తిసామర్థ్యం అన్ని వర్గాలనూ ఆకర్షిస్తోంది. దేశ సరిహద్దుల్లో పహారా, నేరస్తులను పట్టుకోవడం, తదితర అన్ని పనుల్లో ఈ జాగిలాలను చేర్చుకుంటున్నారు. గతంలో ఆర్మీతో పాటు ఇటీవల భారత వాయుసేన నాలుగు శునకాలను భద్రతా సేవలకు స్వీకరించింది. వైమానిక దళ స్థావరాల్లో విమానాల రాకపోకలకు అడ్డుపడుతున్న పక్షులు, ఇతర ప్రాణులను తరిమేందుకు ముధోళ్‌ జాతి కుక్కలను వినియోగిస్తారు.

అందుకే వీటిని ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, వివిధ రాష్ట్రాలలోని పోలీసు శాఖల్లో ఉపయోగించుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020లో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కర్ణాటక ప్రత్యేక జాతిగా పరిగణించబడుతున్న దేశీయ జాతి కుక్క ముధోల్ హౌండ్ గురించి ప్రస్తావించారు. దీనితో పాటు, 2018 సంవత్సరంలో ఒక ర్యాలీలో కూడా వీటి గురించి ప్రస్తావించారు. అప్పటి నుంచి ఈ కుక్కలకు డిమాండ్ పెరిగింది. ఈ శునకాలు నేరాలను గుర్తించడంలో దిట్ట. అంతేకాకుండా వేగంగ పరుగెత్తడం వీటి సొంతం. మొదటిసారిగా ముధోల్ జాతిని BSF, స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్, బందీపూర్ అటవీ శాఖ బృందంలో చేర్చారు. అంతకుముందు వివిధ రాష్ట్రాలలోని ఇండియన్ ఆర్మీ ఫోర్స్, CRPF, పోలీసు స్క్వాడ్‌లలో పనిచేశాయి.

ఇవి కూడా చదవండి

ఈ జాతి ఎందుకు ప్రత్యేకమైనది?

ఈ కుక్కలు వేటా, కాపల ప్రతిభకు ప్రసిద్ధి చెందాయి. ముధోల్ హౌండ్ అనే పేరు దాని పూర్వపు ముధోల్ రాజ్యం (ప్రస్తుత బాగల్‌కోట్‌లో) నుండి వచ్చిందని చెబుతారు. ఈ కుక్కలు చాలా సన్నగా ఉంటాయి. కానీ ఈ కుక్కలు వేట పరంగా చాలా వేగంగా ఉంటాయి. ఈ కుక్కలు చాలా తెలివైనవి కూడా. ఇవే కాకుండా వాసన ద్వారా నేరస్తులను గుర్తించే శక్తి ఎక్కువగా ఉంటుందట. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కథనం ప్రకారం.. మొదట డెక్కన్ రాజ్యమైన ముధోల్ రాజు మలోజీరావు ఘోర్‌పడే ఈ శునకాలను పెంచారు. ఒకసారి రాజు ఈ కుక్కలను ఇంగ్లాండ్ ప్రతినిధులకు బహుమతిగా ఇచ్చాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి