Watch Promo Video: బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో అడుగుపెట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. ‘బాధ్యత ఉండక్కర్లేదా?’ అంటూ కన్నెర్ర చేస్తోన్న జనాలు!

|

Oct 10, 2023 | 3:18 PM

దక్షిణాదిన పలు భాషల్లో బిగ్‌బాస్‌ రియాల్టీ షోలు యమ క్రేజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో తెలుగు బిగ్‌బాస్‌ 7, అక్టోబర్ 1వ తేదీన తమిళ బిగ్‌బాస్ సీజన్‌ 7, అక్టోబర్‌ 8న కన్నడ బిగ్‌బాస్‌ సీజన్‌ 10 ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా కన్నడలో ప్రారంభమైన బిగ్‌బాస్‌ పీకల్లోతు వివాదంలో చిక్కుకుపోయింది. అక్కడి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఏకంగా కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా అడుగుపెట్టడమే అందుకు ప్రధాన కారణం..

Watch Promo Video: బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో అడుగుపెట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. బాధ్యత ఉండక్కర్లేదా? అంటూ కన్నెర్ర చేస్తోన్న జనాలు!
Congress MLA in Kannada Bigg Boss house
Follow us on

బెంగళూరు, అక్టోబర్‌ 10: దక్షిణాదిన పలు భాషల్లో బిగ్‌బాస్‌ రియాల్టీ షోలు యమ క్రేజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో తెలుగు బిగ్‌బాస్‌ 7, అక్టోబర్ 1వ తేదీన తమిళ బిగ్‌బాస్ సీజన్‌ 7, అక్టోబర్‌ 8న కన్నడ బిగ్‌బాస్‌ సీజన్‌ 10 ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా కన్నడలో ప్రారంభమైన బిగ్‌బాస్‌ పీకల్లోతు వివాదంలో చిక్కుకుపోయింది. అక్కడి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఏకంగా కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా అడుగుపెట్టడమే అందుకు ప్రధాన కారణం. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. డప్పుల మోత మధ్య ఎంతో ఘనంగా హౌస్‌లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు హౌస్‌లోకి ఎమ్మెల్యే ఎంట్రీ సంగతి తాజాగా విడుదలైన కన్నడ బిగ్‌బాస్‌ ప్రోమోలో కనిపించింది.

దీంతో ఇందుకు సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మరింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యేను బిగ్‌బాస్‌ షోలో చూసిన జనాలు ఇందేటీ? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ఎన్నికైంది నియోజకవర్గానికి సేవ చేయడానికి గానీ.. రియాలిటీ షోలో పార్టిసిపేట్‌ చేయడానికి కాదంటూ పలువురు విమర్శలు గుప్పిస్తు్న్నారు. ప్రజలకు సేవ చేస్తానని నమ్మబలికి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే ప్రదీప్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వందేమాతరం సోషల్ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను డిమాండ్‌ చేసింది. బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరింది.

ఇవి కూడా చదవండి

కాగా ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి కె సుధాకర్‌ను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచాడు. సోమవారం (అక్టోబర్ 9) చిక్కబళ్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్‌ బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టినట్లు బిగ్‌బాస్‌ టీం ధృవీకిరించింది. ఒక్కసారి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెడితే వారికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇప్పుడు ప్రదీప్ ఈశ్వర్ కూడా 90 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో లాక్ చేయబడితే బయట ఆయన నియోజక వర్గంలో చక్కబెట్టవలసిన పనులు ఎవరు చూసుకుంటారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.