ఈ నెల 26 న తాను రాజీనామా చేసే అవకాశం ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప సూత్రప్రాయంగా ప్రకటించారు. 9ఆ రోజుతో ఆయన రాష్ట్రంలో అధికారానికి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతాయి). బెంగుళూరు శివార్లలోని కచరకనహళ్లి లోని ధన్వంతరి హోమ్ లో గురువారం జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. తాను పార్టీకి విధేయుడినని, తన వెన్నంటి ఉన్న తన లింగాయత్ వర్గం రుణం తీర్చుకోలేనని అన్నారు. ఇన్నేళ్ళుగా వీరు తనవెంటే ఉన్నారని, తనపై విశ్వాసం ఉంచి తనను సీఎంని చేశారని ఆయన చెప్పారు. బీజేపీ కేంద్ర నాయకులకు ఎడ్యూరప్ప కృతజ్ఞతలు తెలిపారు. తనను పదవిలో కొనసాగనివ్వాలని కోరుతూ తన మద్దతుదారులు, అభిమానులు ఎలాంటి నిరసన ప్రదర్శనలకూ దిగరాదని ఆయన కోరారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను శిరసావహిస్తానని, ఈ నెల 25 న అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తుందని అయన చెప్పారు. వాటికి కట్టుబడి ఉంటానన్నారు.
ఇప్పటికే కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప నాయకత్వాన్ని మార్చాలన్న డిమాండ్ ఊపందుకోవడంతో ఇక పార్టీ అధిష్టానం కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎడ్యూరప్ప స్థానే ఎవరిని సీఎంగా ఎంపిక చేస్తారన్నది ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉంది. ముఖ్యంగా తన కుమారుడిని కూడా ఆయన ఇటీవల ఢిల్లీకి తీసుకువెళ్లడాన్ని రాష్ట్రంలో ఆయన అసమ్మతి వర్గీయులు తప్పు పడుతున్నారు. ఢిల్లీలో ఎడ్యూరప్ప ప్రధాని మోదీతోను, ఇతర పార్టీ నేతలతోనూ భేటీ అయిన సంగతి విదితమే. హస్తినలో ఆయన రెండు రోజులు ఉన్నారు. కాగా నిన్నటి రోజంతా ఎడ్యూరప్ప పలువురు మఠాధిపతులతో కూడా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch Video: కరీంనగర్ జిల్లాతో నాకు సెంటిమెంట్ ఉంది..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
ఆసక్తికరంగా మారిన పాము, ముంగీస నడుమ హోరాహోరీ..ఆసక్తి రేపుతున్న వీడియో..:Snake and Mongoose Video.