రైతన్నలకు గుడ్‌న్యూస్‌! సున్నా వడ్డీకి రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం ప్రకటించిన సర్కార్‌

|

Feb 17, 2023 | 4:58 PM

రానున్న ఎన్నికల నేపథ్యంలో రైతన్నలను ఆకట్టుకునేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరాల వర్షం కురిపించారు. రైతులకు ఇచ్చే సున్నా వడ్డీల రుణ పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి..

రైతన్నలకు గుడ్‌న్యూస్‌! సున్నా వడ్డీకి రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం ప్రకటించిన సర్కార్‌
Karnataka Budget 2023 24
Follow us on

రానున్న ఎన్నికల నేపథ్యంలో రైతన్నలను ఆకట్టుకునేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరాల వర్షం కురిపించారు. రైతులకు ఇచ్చే సున్నా వడ్డీల రుణ పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు శుక్రవారం (ఫిబ్రవరి 17) ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ సమర్పణ సమయంలో ఈ మేరకు బొమ్మై వెల్లడించారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 30 లక్షల మందికి పైగా రైతులకు రూ.25 వేల కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ హోల్డర్లకు ‘భూ సిరి’ పథకం కింద 2023-24 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.2,500, నాబార్డ్ అందజేసే రూ.7,500లతో కలిపి మొత్తం రూ.10,000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు బొమ్మై తెలిపారు.

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసేందుకు రైతన్నలకు ఆసరాగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనివల్ల దాదాపు 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. మహిళా రైతు కూలీలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ. 500 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ‘శ్రమ శక్తి’ పథకాన్ని కూడా సీఎం బడ్జెట్‌లో ప్రకటించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్-మేలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ఆధికారంలోకి వచ్చేందుకు ముందస్తు కార్యచరణలో భాగంగా బొమ్మై సర్కార్‌ ఈ మేరకు బడ్జెట్‌లో కొత్త పథకాలను ప్రవేశపెట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.