Karnataka Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న లారీ.. 9 మంది దుర్మరణం..

ఈ దుర్ఘటన కర్ణాటక తమకూరు జిల్లాలోని శిరా తాలూకా కలకంబెల్లా సమీపంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సమయంలో క్రూజర్‌లో 20 మంది ఉన్నారు.

Karnataka Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న లారీ.. 9 మంది దుర్మరణం..
Road Accident

Updated on: Aug 25, 2022 | 8:44 AM

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో లారీ.. కారు (క్రూయిజర్‌) ను ఢీకొనడంతో మొత్తం 9 మంది దుర్మరణం చెందారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన కర్ణాటక తమకూరు జిల్లాలోని శిరా తాలూకా కలకంబెల్లా సమీపంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సమయంలో క్రూజర్‌లో 20 మంది ఉన్నారని, 9 మంది అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 11 మందిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల పేర్లు, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తర కర్ణాటక నుంచి కూలీ పనుల కోసం బెంగళూరు ప్రాంతానికి వచ్చే వారు ఎక్కువగా క్రూయిజర్లపైనే ఆధారపడుతుంటారు. కాఖలంబెల్లా చెక్‌పోస్టు, టోల్‌ సమీపంలో ఇలాంటి ప్రమాదాలు పదే పదే జరుగుతున్నాయి.

వ్యవసాయ పనుల సమయంలో రైతులు గ్రామాలకు తిరిగి వెళుతుంటారు. ఆ తర్వాత క్రూజర్ల ద్వారా బెంగళూరుకు చేరుకొని గుడిసెలు వెసుకొని లేదా.. అద్దె షెడ్లు తీసుకొని కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..