Kargil Vijay Diwas: కార్గిల్ జవాన్లను గుర్తు చేసుకున్న దేశ ప్రజలు.. వీరులకు రాష్ట్రపతి నివాళి..

కార్గిల్​ దివాస్​ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శ్రీనగర్‌కు వచ్చారు. 4రోజుల కశ్మీర్‌ టూర్‌కి వచ్చిన కోవింద్ త్రివిద దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Kargil Vijay Diwas: కార్గిల్ జవాన్లను గుర్తు చేసుకున్న దేశ ప్రజలు.. వీరులకు రాష్ట్రపతి నివాళి..
Kargil Vijay Diwas Presiden

Updated on: Jul 26, 2021 | 11:38 AM

కార్గిల్‌ వీరులారా వందనం.. విజయానికి 22 ఏళ్లు.. 1999 జులై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవం జరిగింది. అప్పటి నుంచీ ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ విజయం వెనుక ఎంతో మంది సైనికుల ప్రాణ త్యాగం ఉంది..ఈ వీరోచిత పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు నివాళులర్పిస్తున్నారు దేశ ప్రజలు. 1998లో కార్గిల్‌ సెక్టార్‌లో దాయాది పాకిస్తాన్‌ దాడిని భారత భద్రతా బలగాలు విజయవంతంగా తిప్పికొట్టిన రోజు.

కేంద్ర ప్రభుత్వం అప్పటి నుండి కార్గిల్ దివాస్‌ వేడుకలను నిర్వహిస్తోంది. ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌లో జరిగే కార్యక్రమాల్లో రాష్టప్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌, డిఫెన్స్‌ మినిస్టర్‌ రాజ్‌నాథ్‌సింగ్‌, త్రివిథ దళాల అధిపతులు అమర జవాన్లకు నివాళులర్పించారు.

తమ ప్రాణాలను అడ్డుపెట్టి మన దేశాన్ని రక్షించడమే కాదు.. పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాకిస్తాన్ వక్రబుద్ధిని భారత వీరులు విజయవంతంగా తిప్పి కొట్టారు. పాకిస్తాన్‌ కన్ను ఎప్పుడూ భారత్ పైనే.. ముఖ్యంగా కశ్మీర్‌ మీదే ఉంటుంది. ఏదో ఒక వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా ఇలానే చేసింది.

అందుకు ఉగ్రవాదులతో పాక్‌ ఆర్మీ చేతులు కలిపింది. సహాజ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్‌​ఆర్మీ ధీటుగా స్పందించింది. ఆపరేషన్‌ విజయ్‌ పేరుతో పాక్‌కు బుద్ధి చెప్పింది. అప్పటి నుంచీ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ జరుపుకుంటున్నారు.

కార్గిల్​ దివాస్​ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శ్రీనగర్‌కు వచ్చారు. నాలుగు రోజుల కశ్మీర్‌ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి కోవింద్ త్రివిద దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ద్రాస్‌ సెక్టార్‌లో కార్గిల్ యుద్ధ సంస్మరణ కేంద్రం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు.

 

ఇవి కూడా చదవండి: Ramappa Temple: తెలంగాణ ప్రజలకు అభినందనలు.. రామప్పకు అరుదైన గౌరవంపై ప్రధాని మోడీ ట్వీట్

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Miracle Bore Water: ఆ బోరు వాటర్ తాగితే కీళ్ల నొప్పులు మాయం.. ఆ నీటి కోసం క్యూ కడుతున్న జనం..