Anil Deshmukh Resign: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా.. కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్..

|

Apr 05, 2021 | 5:11 PM

Anil Deshmukh Resign: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్..

Anil Deshmukh Resign: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా.. కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్..
Actress Kangana Ranaut
Follow us on

Anil Deshmukh Resign: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించింది. అనిల్ దేశ్‌ముఖ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘స్త్రీని వేధించి, హింసించిన వారికి పతనం తప్పదు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్‌లో ఇంకా చాలా ఉంటాయి.’ అంటూ కంగనా ట్వీట్ చేసింది. అంతేకాదు.. అనిల్ దేశ్‌ముఖ్, ఉద్ధవ్ ఠాక్రే ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ చేసింది.

విధి నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారంటూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మార్చి 31న బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. అధికారులకు రూ. 100 కోట్లు వసూళ్లు టార్గెట్ విధించారని తన పిటిషన్‌లో పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేసును విచారించిన బాంబే హైకోర్టు.. సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ చే దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా ఆధారాలు లభిస్తే కేసులు నమోదు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు నిర్ణయం, ఆరోపణల నేపథ్యంలో సోమవారం నాడు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు.

Kangana Tweet:

అయితే, అనిల్ రాజీనామాపై స్పందించిన ఓ నెటిజన్.. గతంలో కంగనా రనౌత్ చేసిన వీడియో ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఆ వీడియోలో కంగనా ‘ఈ రోజు నా ఇల్లును ధ్వంస చేసిండొచ్చు. కానీ రేపు మీ అహంకారం కూడా దిగిపోతుంది. గుర్తుంచుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.’ అంటూ వ్యాఖ్యానించింది. దీనిని రీట్వీట్ చేసిన నెటిజన్.. కంగనాను ట్యాగ్ చేశారు. దీంతో కంగనా రియాక్ట్ అయ్యింది. నాటి వివాదాన్ని గర్తు చేస్తూ ఘాటైన కామెంట్ చేసింది.

కొన్ని నెలల క్రితం.. కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా తీవ్ర విమర్శలు చేయగా.. కంగనాకు ముంబైలో నివసించే అర్హతే లేదంటూ అనిల్ దేశ్‌ముఖ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ వివాదం నేపథ్యంలోనే కంగనా రనౌత్ కార్యాలయాన్ని అక్రంగా నిర్మించారనే కారణంతో బీఎంసీ అధికారులు కూల్చివేశారు. ఆ సమయంలో అధికారులు, ప్రభుత్వ పెద్దలు, కంగనా రనౌత్ మధ్య మాటల యుద్ధం నడిచింది.

Also read:

స్కైబ్లూ కలర్ చీరలో హైబ్రిడ్ పిల్లా.. సాయి పల్లవి కట్టిన సారీ రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Heroine Kajal Aggarwal: అందాల చందమామ అందమైన మనసు.. అభిమాని చదువుకోసం లక్ష ఆర్ధిక సాయం..

Cobra Battalion Jawan Safe: గల్లంతైన కోబ్రా జవాన్‌ మా వద్దే ఉన్నాడు.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్టులు..