Kamal Haasan: ఉదయనిధికి అండగా కమల్ హాసన్.. చిన్నపిల్లాడిని చేసి టార్గెట్ చేస్తున్నారంటూ కామెంట్

తాజాగా ఉదయనిధి సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను భారతీయ చలన చిత్రంలో స్టార్ హీరో కమల్ హాసన్ సమర్థించారు. ఉదయనిధి సనాతన్ ధర్మంపై వివాదాస్పద ప్రకటనపై కమల్ హాసన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకే చిన్న పిల్లవాడు ఉదయనిధిని టార్గెట్ చేస్తున్నారంటూ అండగా నిలిచారు. పెరియార్ వల్లనే మనందరికీ 'సనాతన' అనే పదం తెలిసింది.

Kamal Haasan: ఉదయనిధికి అండగా కమల్ హాసన్.. చిన్నపిల్లాడిని చేసి టార్గెట్ చేస్తున్నారంటూ కామెంట్
Kamal Haasan

Updated on: Sep 23, 2023 | 1:12 PM

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మం గురించి చేసిన  వివాదస్పద వ్యాఖ్యలపై పలు హిందూ ధార్మిక సంస్థల సహా హిందువులు సైతం మండిపడుతున్నారు. కొందరు ఇప్పటికే ఉదయానిధిపై కోట్లు మెట్లు ఎక్కి కేసు నమోదు చేశారు కూడా.. అయితే తాజాగా ఉదయనిధి సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను భారతీయ చలన చిత్రంలో స్టార్ హీరో కమల్ హాసన్ సమర్థించారు. ఉదయనిధి సనాతన్ ధర్మంపై వివాదాస్పద ప్రకటనపై కమల్ హాసన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకే చిన్న పిల్లవాడు ఉదయనిధిని టార్గెట్ చేస్తున్నారంటూ అండగా నిలిచారు. పెరియార్ వల్లనే మనందరికీ ‘సనాతన’ అనే పదం తెలిసింది.

మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పెరియార్ గురించి ప్రస్తావించగా.. ఉదయనిధి పూర్వీకులు కూడా ఈ విషయంపై చాలా మాట్లాడారు. ఇదేమీ కొత్త విషయం కాదు. పెరియార్ బనారస్ అంటే ఇప్పటి కోల్ కతా లోని దేవాలయాల్లో కూడా పూజలు చేశారు. నుదిటిమీద కుంకుమ రోజూ ధరించేవారు. అతనే సనాతన ధర్మం అనే పదాన్ని పరిచయం చేశాడు. చాలా చెప్పారు. అయితే ఒకసారి హఠాత్తుగా అన్నిటిని వదిలేసి  మానవాళికి సేవ చేయడం ప్రారంభించారు. అంటే అతనికి సనాతన ధర్మం మీద ఎంత కోపం ఉందో ఊహించండి. తన చివరి క్షణాల వరకు సమాజానికి సేవ చేశారంటూ వెల్లడించారు.

కోయంబత్తూరులో జరిగిన ఓ సభలో కమల్ హాసన్ మాట్లాడుతూ పెరియార్‌ను డీఎంకే లేదా మరే ఇతర పార్టీ కూడా తమ సొంతమని చెప్పుకోలేరని.. ఎందుకంటే తమిళనాడు మొత్తం పెరియార్‌ను తమ ఆదర్శంగా భావించి ఆయన ఆలోచనలను అనుసరిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఉదయనిధి వివాదాస్పద ప్రకటన

వాస్తవానికి తమిళనాడు యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్..  సనాతన ధర్మాన్ని డెంగ్యూ,  మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ఈ వ్యాధుల మాదిరిగానే సనాతన ధర్మాన్ని కూడా తొలగించాలని అన్నారు. ఉదయనిధి చేసిన ఈ ప్రకటనతో రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై బీజేపీ, విపక్షాల నేతలు వ్యాఖ్యానించారు. అయితే వివాదం ముదిరిన తర్వాత ఉదయనిధి తన ప్రకటనపై వివరణ ఇస్తూ.. తాను కేవలం సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించానని చెప్పాడు. తన ప్రకటనను తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..