ఇటీవలి కాలంలో చాలా మంది ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.. శరీరాన్ని హెల్తిగా, మంచి ఫిట్‌నెస్‌తో ఉంచుకోవటం కోసం అనేక రకాలైన డైట్ ప్లాన్‌లను ఫాలో అవుతున్నారు. ఒక్కోసారి అలాంటి డైట్ ఎఫెక్ట్ అనర్థాలకు దారితీస్తుంది. డైట్‌ఎఫెక్ట్ కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. నటుడు కళ్యాణ్ కుమార్ తనయుడు భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శిని తన డైట్ మార్చుకున్న కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని రిపోర్ట్స్‌లో తేలింది. దీంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల క్రితం ప్రియదర్శిని పలియో డైట్ తీసుకోవడం మొదలుపెట్టిందట. దీంతో ఒక్కసారిగా జరిగిన ఈ ఆహారం మార్పుల వల్ల ఆమె శరీరంలో షుగర్స్ లెవెల్ పడిపోయి ఆ తర్వాత సీరియస్ కావడంతో మూడు నెలల పాటు చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. 2007లో వచ్చిన శ్రీరంగం అనే తమిళ సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చారు భరత్.
ప్రియదర్శిని కొత్త డైట్‌ని అనుసరించింది. దీని ప్రకారం వారి ఆహారంలో పాల ఉత్పత్తులు లేవు. పండ్లు, కూరగాయలు, చేపలు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినేవారు. అకస్మాత్తుగా ఆహారంలో మార్పు కారణంగా, ఆమె రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువైంది. దీంతో ప్రియదర్శిని కోమాలోకి వెళ్లింది. మూడు నెలల క్రితమే ప్రియదర్శిని కోమాలోకి వెళ్లిందనేది షాకింగ్ వాస్తవం. అనంతరం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. అయితే, చికిత్స పొందుతూనే ప్రియదర్శిని కన్నుమూసింది. ఇలాంటి ఫుడ్ డైట్స్ పట్ల అందరికి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
భరత్, ప్రియదర్శిని దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రియదర్శిని హఠాన్మరణం అందరినీ కలిచివేసింది. కుటుంబమంతా కన్నీరు మున్నీరుగా విలపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి