Supreme Court తదుపరి సీజేఐ గా జస్టిస్ యు.యు.లలిత్.. ఆగస్టు 27న ప్రమాణ స్వీకారం

|

Aug 04, 2022 | 12:57 PM

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) ఎవరనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ప్రస్తు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రవణ పదవీ విరమణ అనంతరం.. జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (UU.Lalit) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు..

Supreme Court తదుపరి సీజేఐ గా జస్టిస్ యు.యు.లలిత్.. ఆగస్టు 27న ప్రమాణ స్వీకారం
Justice Uu.lalith
Follow us on

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) ఎవరనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ప్రస్తు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రవణ పదవీ విరమణ అనంతరం.. జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (UU.Lalit) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ లేఖ రాశారు. కాగా ఈ లేఖను కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరిశీలనకు పంపనుంది. ఆయన ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి వద్దకు చేరుకుని.. రాష్ట్రపతి (President) అనుమతితో ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ దేశంలోనే పలు సంచలనాత్మక కేసులకు తీర్పులు వెలువరించారు. త్రిపుల్‌ తలాక్‌ సహా, అనేక కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చారు. 1957 లో జన్మించిన ఆయన.. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ చేసి, 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. అనంతరం 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

అయితే.. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌వి. రమణ ఈ నెల (ఆగస్టు) 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. సాధారణంగా సీజేఐ పదవీ విరమణ తర్వాత.. ఆ పదవిని సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న వారి పేరును సిఫార్సు చేస్తారు. ఆ ప్రకారం జస్టిస్‌ యు.యు.లలిత్‌ అత్యంత సీనియర్‌గా ఉన్నారు. ఆగస్టు 27న ప్రమాణస్వీకారం చేసి, నవంబర్ ఎనిమదో తేదీన పదవీ విరమణ చేస్తారు. కేవలం మూడు నెలల్లోనే ఆయన పదవీకాలం ముగియనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి