Rajya Sabha: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం.. రాజ్యసభ సభాపతి స్థానంలో

రాజ్యసభ వైస్ చైర్మన్‌ కొత్త ప్యానల్‌లో విజయసాయి రెడ్డికి ఇటీవలే ఛాన్స్ దక్కింది. తాజాగా ఆయనకు సభను నడిపించే అవకాశం కూడా లభించింది. ఆ వీడియో దిగువన చూడండి.

Rajya Sabha: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం.. రాజ్యసభ సభాపతి స్థానంలో
Vijay Sai Reddy
Follow us

|

Updated on: Aug 04, 2022 | 12:58 PM

వైసీపీ రాజ్యసభ్య ఎంపీ, ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌యసాయి రెడ్డి(Vijayasai Reddy)కి అరుదైన ఛాన్స్ లభించింది. ఇటీవల ఆయన రాజ్యసభ వైస్ ఛైర్మ‌న్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సభను నడిపించే అవకాశం దక్కింది. రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ హోదాలో గురువారం తొలిసారి రాజ్యసభ అధ్యక్ష స్థానంలో ఆశీనులై సభా వ్యవహారాలు నడిపించారు సాయిరెడ్డి. రాజ్య‌స‌భ ఛైర్మ‌న్, డిప్యూటీ ఛైర్మ‌న్ ఇద్దరూ.. అవైలబుల్‌గా లేనప్పడు.. వైస్ ఛైర్మన్లలో ఎవరో ఒకరు.. సభను నడిపించాల్సి ఉంటుంది.గత నెలలోనే రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌ను వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు(Muppavarapu Venkaiah Naidu) రీ షఫిల్ చేశారు. అప్పుడు విజయ సాయికి అందులో చోటు లభించింది. ఇక లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Midhun Reddy ) ప్యానెల్ స్పీక‌ర్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయన సభను నడిపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి