Madhya Pradesh: ‘బీజేపీలో చేరండి.. లేదంటే బుల్డోజర్లు వచ్చేస్తాయ్’.. సంచలనంగా మారిన మంత్రి వార్నింగ్..

ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి. అంతకు ముందు ఒక పార్టీకి లీడర్. అయితే, పార్టీ కోసం తన పవర్‌ను ఉపయోగించే ప్రయత్నంలో.. మాట తూలాడు. ఇప్పడదే సంచలనంగా మారింది.

Madhya Pradesh: ‘బీజేపీలో చేరండి.. లేదంటే బుల్డోజర్లు వచ్చేస్తాయ్’.. సంచలనంగా మారిన మంత్రి వార్నింగ్..
Mahendra Singh Sisodia

Updated on: Jan 20, 2023 | 9:46 AM

ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి. అంతకు ముందు ఒక పార్టీకి లీడర్. అయితే, పార్టీ కోసం తన పవర్‌ను ఉపయోగించే ప్రయత్నంలో.. మాట తూలాడు. ఇప్పడదే సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా మంత్రి? ఏం అన్నారు? వివరాలు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. విపక్ష పార్టీలు ఆయన కామెంట్స్‌పై ఫైర్ అవుతున్నాయి. రాష్ట్రంలో నాయకులంతా బీజేపీలో చేరాలని, లేదంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడిదే వివాదాస్పదంగా మారింది. ఆయన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇటీవల గుణ జిల్లాలోని రుతియాయ్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సిసోడియా.. ‘అందరూ బీజేపీలో చేరిపోండి. 2023లో జరిగే ఎన్నికల్లనో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. బుల్డోజర్లు వచ్చేస్తాయ్. కుల్చివేతలు ఉంటాయ్.’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనవరి 20న జరగనున్న రఘోఘర్ నగర మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.

అయితే, ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు భగ్గమంటున్నారు. సిసోడియా వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ నేతల మాటలు శృతిమించుతున్నాయని ఫైర్ అయ్యారు. మంత్రి వ్యాఖ్యలు సరికాదని, జనవరి 20న జరిగే ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నేత విజయ వర్గీయ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..