Seema Patra: పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన బీజేపీ నాయకురాలు సీమా పాత్ర అరెస్ట్.. పారిపోతుండగా..

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:07 PM

సీమా ఇంట్లో పనిచేసే సునీత శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సీమా పాత్రా.. తనను బంధించి తీవ్రంగా హింసించారని

Seema Patra: పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన బీజేపీ నాయకురాలు సీమా పాత్ర అరెస్ట్.. పారిపోతుండగా..
Seema Patra
Follow us on

BJP leader Seema Patra arrested: జార్ఖండ్‌లో పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన బీజేపీ సీనియర్‌ నాయకురాలు సీమా పాత్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సీమా ఇంట్లో పనిచేసే సునీత శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సీమా పాత్రా.. తనను బంధించి తీవ్రంగా హింసించారని సునీత ఆ వీడియోలో కన్నీరుమున్నీరయ్యింది. కొన్ని సార్లు ఇనుప రాడ్లతో కూడా కొట్టేవారని, ఓసారి తన పన్ను కూడా విరిగిపోయిందని తెలిపింది. 29 ఏళ్ల సునీత కొన్నేళ్ల క్రితం రాంచీలోని అశోక్‌నగర్‌ ప్రాంతంలో గల సీమా పాత్ర నివాసంలో పనికి చేరింది. సునీతను సీమా చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు కొందరు సమాచారమివ్వడంతో గతవారం పోలీసులు ఆమెను రక్షించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి సీమా పాత్ర పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. రోడ్డు మార్గంలో రాంచీ నుంచి పారిపోయేందుకు యత్నిస్తుండగా పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీమా పాత్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్‌ డీజీపీకి లేఖ రాసింది.

సీమా పాత్రా భాజపా మహిళా విభాగం జాతీయ వర్కింగ్‌ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె భర్త మహేశ్వర్‌ పాత్రా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. పనిమనిషి వీడియో వైరల్‌గా మారిన తర్వాత సీమాను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి