Lok Sabha Elections 2024: జార్ఖండ్ లోక్ సభ ఎన్నికలకు ముందు మరోసారి ఈడీ దాడులు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. మే 6 సోమవారం రోజున రాంచీలోని పలు ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు, జార్ఖండ్ ప్రభుత్వ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ సర్వెంట్ ఇంటిపై దాడి చేసిన ED భారీగా నగదును స్వాధీనం చేసుకుంది. రికవరీ చేసిన నగదు మొత్తం రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నోట్లను లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లను తీసుకొచ్చారు అధికారులు. ఇది నల్లధనంలో భాగమేనని ఈడీ అభిప్రాయపడింది. సంజీవ్ లాల్ సేవకుడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అతని బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత పత్రాలపై సోదాలు చేస్తున్నారు.
అందిన సమాచారం ప్రకారం, టెండర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాంచీలో దాడులు నిర్వహిస్తోంది. రాంచీలోని సెల్ సిటీతో సహా మొత్తం 9 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. సోమవారం ఉదయం ఈడీ బృందం సెయిల్ సిటీలోని రోడ్డు నిర్మాణ విభాగం ఇంజనీర్ వికాస్‌కుమార్ దాచిన స్థలంలో సోదాలు చేసింది. ఈడీ మరో బృందం బరియాతు ప్రాంతంలో దాడులు నిర్వహిస్తోంది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంజనీర్ వీరేంద్ర రామ్‌కు సంబంధించిన కేసులో ఈడీ బృందం ఈ మేరకు చర్య తీసుకుంటోంది.
#WATCH | The Enforcement Directorate is conducting raids at multiple locations in Ranchi. Huge amount of cash recovered from household help of Sanjiv Lal – PS to Jharkhand Rural Development minister Alamgir Alam, in Virendra Ram case.
ED arrested Virendra K. Ram, the chief… pic.twitter.com/VTpUKBOPE7
— ANI (@ANI) May 6, 2024
ఆలంగీర్ ఆలం పాకుర్ అసెంబ్లీ నుండి నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి ముందు, అలంగీర్ ఆలం 20 అక్టోబర్ 2006 నుండి 12 డిసెంబర్ 2009 వరకు జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..