Hemant Soren: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం హేమంత్‌ సోరెన్‌.. బీజేపీపై కౌంటర్ అటాక్..

మైనింగ్‌ స్కాంలో అనర్హత వేటు వెంటాడుతున్న వేళ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్దమయ్యారు హేమంత్‌ సోరెన్‌. ఈ సమయంలో సీఎం ప్రసంగాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించడతో గందరగోళం చెలరేగింది.

Hemant Soren: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం హేమంత్‌ సోరెన్‌.. బీజేపీపై కౌంటర్ అటాక్..
Hemant Soren
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 05, 2022 | 1:50 PM

Hemant Soren: జార్ఖండ్‌ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్‌ సోరెన్‌ నెగ్గారు. సొరెన్ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా బీజేపీపై నిప్పులు చెరిగారు సోరెన్‌. మైనింగ్‌ స్కాంలో అనర్హత వేటు వెంటాడుతున్న వేళ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్దమయ్యారు హేమంత్‌ సోరెన్‌. అయితే సీఎం ప్రసంగాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించడతో గందరగోళం చెలరేగింది. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. మెజారిటీ కావాలంటే 42 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. విశ్వాసపరీక్షలో హేమంత్‌ సోరెన్‌కు మద్దతుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. యూపీఏ కూటమికి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మైనింగ్‌ స్కామ్‌లో సీఎం హేమంత్‌ సోరెన్‌ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఈసీ సిఫారసు చేసింది. అయితే ఇప్పటివరకు గవర్నర్‌ ఈసీ నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కావాలనే, బీజేపీ తమ ప్రభుత్వానికి అడ్డంకులను సృష్టిస్తుందని హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బెంగాల్‌లో ఉన్నారని.. బెంగాల్‌కు వారు వెళ్లడం వెనుక అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై విచారణకు వెళ్తున్న పోలీసులకు ఆయా రాష్ట్రాలు సహకరించడం లేదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు తలపడే వాతావరణం సృష్టించాలనుకున్నారని.. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రోత్సహించాలని చూశారంటూ విమర్శించారు. ఇక్కడ యూపీఏ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇలాంటివి చెల్లవని.. త్వరలోనే తగిన సమాధానం లభిస్తుందంటూ జార్ఖండ్ సీఎం బీజేపీపై ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల కేబినేట్ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం.. ఈ రోజు జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తన బలాన్ని నిరూపించుకున్నారు. కాగా.. అక్రమ మైనింగ్ స్కామ్‌లో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శాసనసభ సభ్యత్వంపై వేటు పడనుందని గతకొంతకాలంగా ప్రచారం జరగుతోంది. ఈ సమయంలో.. జేఎంఎం- కాంగ్రెస్, కూటమి ఎమ్మెల్యేలంతా సోరెన్‌కు మద్దతుగా నిలిచారు. ఇవాళ అసెంబ్లీలో ఏం జరుగుతుంది..? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న హేమంత్ సొరెన్.. అన్నట్టుగానే ఈ పరీక్షలో నెగ్గి చూపించారు. దీని తర్వాత పరిస్థితి ఏమిటన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి.