Mining Case: ఈడీ ఎదుట హాజరైన సీఎం.. ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు..

జార్ఖండ్ రాజధాని రాంచీ నివురుగప్పిన నిప్పులా మారింది. రాష్టర ముఖ్యమంత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్..

Mining Case: ఈడీ ఎదుట హాజరైన సీఎం.. ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు..
Jharkhand Cm Hemant Soren

Updated on: Nov 17, 2022 | 12:53 PM

జార్ఖండ్ రాజధాని రాంచీ నివురుగప్పిన నిప్పులా మారింది. రాష్టర ముఖ్యమంత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. హేమంత్ సోరెన్ నివాసం వద్దకు ఆయన మద్దతుదారులు భారీగా తరలి వస్తున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

అక్రమ మైనింగ్‌ కేసులో దూకుడు పెంచింది ఈడీ. ఈ కేసులో ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌. విచారణలో మనీ లాండరింగ్‌ ఆరోపణలపైనా ఆరా తీయనుంది దర్యాప్తు సంస్థ. హేమంత్‌కు 200 ప్రశ్నలు సంధించేందుకు సిద్ధమయ్యారు ఈడీ అధికారులు.

అక్రమ మైనింగ్‌ ఆరోపణల్ని కొట్టిపారేశారు సీఎం హేమంత్‌ సోరెన్‌. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎత్తుగడలు తమ ముందు పనిచేయవన్నారు సీఎం హేమంత్‌ సోరెన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..