AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family: ఆ ఫ్యామిలీకి రోజు 10 లీటర్ల పాటు.. ఒక్కపూట భోజనానికి బస్తా కూరగాయలు కావాల్సిందే.. ఎంతమంది ఉంటారో తెలిస్తే గుండె గుభేలే..

‘కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం’.. వెంకటేష్ నటించిన ‘కలిసుందాంరా’ సినిమాలోని ఈ పాటలో ఉమ్మడి కుటుంబంతో కలిగే ఆనందం ఏంటో అద్భుతంగా..

Family: ఆ ఫ్యామిలీకి రోజు 10 లీటర్ల పాటు.. ఒక్కపూట భోజనానికి బస్తా కూరగాయలు కావాల్సిందే.. ఎంతమంది ఉంటారో తెలిస్తే గుండె గుభేలే..
Joint Family
Shiva Prajapati
|

Updated on: Nov 17, 2022 | 12:51 PM

Share

‘కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం’.. వెంకటేష్ నటించిన ‘కలిసుందాంరా’ సినిమాలోని ఈ పాటలో ఉమ్మడి కుటుంబంతో కలిగే ఆనందం ఏంటో అద్భుతంగా వివరించడం జరుగుతుంది. తరతరాల నుంచి భారత సమాజాం.. ఉమ్మడి కుటుంబంగానే ఉంటూ వస్తోంది. పిల్లలకు పెళ్లిళ్లు అయి, వారికి పిల్లలు ఉన్నా ఉమ్మడిగానే జీవనం సాగిస్తూ వస్తున్నారు. అయితే, కాల క్రమేణా ఉమ్మడి కుటుంబాలు కాస్తా విచ్ఛిన్నం అవుతున్నప్పటికీ.. దేశంలో ఎక్కడో చోట ఇప్పటికీ పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. వారే ఇప్పుడు చాలా స్పెషల్‌గా నిలుస్తున్నారు. అలాంటి స్పెషల్ కుటుంబాన్నే ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నాం.

ఉమ్మడి కుటుంబానికి కేరాఫ్‌గా నిలిచిన ఈ కుటుంబంలో అందరూ కలిపి 72 మంది వరకు ఉన్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ఈ కుటుంబం ఎంతో మందికి ఆదర్శనంగా నిలుస్తోంది. ఈ కుటుంబంలో నాలుగు తరాల వారు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వృద్ధులు, పురుషులు, మహిళలు, పిల్లలు సహా నాలుగు తరాల వారు ఒకే పైకప్పు కింద నివసిస్తున్నారు. వీరి జీవన విధానం, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ విభిన్నంగా ఉన్నాయి.

వర్తక వ్యాపారాన్ని నడుపుతున్న అశ్విన్ దోయిజోడ్ కుటుంబానికి ప్రతి రోజూ 10 లీటర్ల పాలు అవసరం పడుతుంది. అలాగే, ఒక రోజు ఒక పూట భోజనం చేయడానికి రూ. 1000 నుంచి రూ. 1,200 విలువ చేసే కూరగాయలు వండాల్సి ఉంటుంది. కర్ణాటకకు చెందిన దోయిజోడ్ కుటుంబం.. 100 సంవత్సరాల క్రితమే షోలాపూర్‌కు వలస వచ్చారు. అప్పటి నుంచి వారంతా అక్కడే నివసిస్తున్నారు. కుటుంబ పెద్ద అయిన అశ్విన్ దోయిజోడ్ మాట్లాడుతూ.. ‘మాది చాలా పెద్ద కుటుంబం. మా పిల్లలు, వారి పిల్లలు అంతా కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నాం. కుటుంబ సభ్యులంతా కలిసి 72 మంది ఉంటాం. మాకు ఉదయం, సాయంత్రం కలిపి 10 లీటర్ల పాలు అవసరం అవుతాయి. అలాగే, ప్రతీపూట భోజనానికి రూ. 1,000 నుంచి రూ. 1,200 విలువైన కూరగాయలు అవసరం పడుతాయి. ఇక మాంసాహార భోజనం అయితే, మూడు నాలుగు రెట్లు అధికంగా ఖర్చు అవుతుంది.’ అని చెప్పుకొచచారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఉమ్మడి కుటుంబం విషయంలో, పెరుగుతున్న కుటుంబ సభ్యుల సంఖ్యను చూసి తొలుత ఆందోళనకు గురయ్యామని, ఇప్పుడు మొత్తం కుటుంబంతో కలిసి మెలిసి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నామని తెలిపారాయన. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ, అందరూ ఆప్యాయంగా, ప్రేమతో ఉంటారు. ఈ ఇంటికి కోడలిగా వచ్చేందుకు చాలా మంది భయపడినట్లు దోయిజోడ్ తెలిపారు. ‘నేను కూడా ఇంత పెద్ద కుటుంబాన్ని చూసి మొదట్లో భయపడ్డాను. కానీ, అందరూ నాకు సహాయం చేశారు. మా అత్తయ్య, సోదరి, అన్నదమ్ములు అందరూ నేను స్థిరపడేందుకు సహాయం చేశారు.’ అని అశ్విన్ దోయిజోడ్ కోడలు నైనా దోయిజోడ్ తెలిపారు. ఈ బిగ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నెటిజన్ల రియాక్షన్..

ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుత కాలంలోనూ ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబ ఉండటం అంటే చాలా గ్రేట్ అని పేర్కొంటున్నారు. ఇది భారతీయుల గొప్పదనం అని కీర్తిస్తున్నారు. ఒక భారతీయు ఉమ్మడి కుటుంబం అందం.. షోలాపూర్ కుటుంబంలో కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వీరంతా నిజంగా అదృష్ట వంతులని, వీరికి భగవంతుడిని ఆశీర్వాదాలు గట్టిగానే ఉన్నాయంటూ కామెంట్స్ రాస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మృత్యువుకు అడుగు దూరంలోకి వెళ్లి వచ్చిన మహిళ.. !
మృత్యువుకు అడుగు దూరంలోకి వెళ్లి వచ్చిన మహిళ.. !
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం
ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే