Jharkhand Robbery: జార్ఖండ్ లోని ధన్‌బాద్‌లో ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ యత్నం విఫలమయయింది. రాబరీకి ముగ్గురు ట్రై చేయగా.. వారి ప్రయత్నానికి చెక్ పెట్టారు పోలీసులు. ఎదురుదాడికి దిగిన వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ దొంగ చనిపోయాడు. మరో ఇద్దరు దొరికిపోయారు. అయితే, పట్టపగలు నడిరోడ్డుపై ఎన్‌కౌంటర్ జరగడంతో దన్‌బాద్ ఉలిక్కిపడింది. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టు అనేది పాత సామెత. సినిమాల్లో మాదిరి క్లైమాక్స్‌లోనే వస్తారంటూ పోలీసులపై సెటైర్లు కూడా ఉన్నాయి. ధన్‌బాధ్‌లో ఘటన చూస్తే.. అవన్నీ ఉత్తమాటలని తేలిపోతుంది. పోలీసులు చాకచక్యంగా ఈ దోపిడీ కుట్రను భగ్నం చేశారు.
మొత్తం ఐదుగురు సభ్యుల దోపిడీ ముఠా ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఓ దొంగ ఎన్‌కౌంటర్‌లో చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. వాళ్లిద్దరిని ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. మరో ఇద్దరు దొంగలు అదే ప్రాంతంలో నక్కినట్టు తెలుస్తోంది. వాళ్లను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ధన్‌బాద్‌లో రెండు రోజుల క్రితమే నగల దుకాణాన్ని లూటీ చేశారు దోపిడీ దొంగలు. గుంజన్ జ్యువెలరీ షాప్ నుంచి కోటి రూపాయల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన తరువాత ధన్‌బాద్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..